ETV Bharat / state

Kishan Reddy: క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి ఒలింపిక్స్‌కు పంపుతాం

author img

By

Published : Aug 29, 2021, 3:17 PM IST

Updated : Aug 29, 2021, 3:45 PM IST

Kishan Reddy
Kishan Reddy

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా వర్సిటీలో నిర్మించబోతున్న స్పోర్ట్స్ క్లస్టర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగ్ గౌడ్​ పాల్గొన్నారు.

'క్రీడాకారులను ఒలంపిక్స్​కు పంపటమే కేంద్రం లక్ష్యం'

దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల్లోని ప్రతిభను గుర్తించి... వారిని ఒలింపిక్స్‌కు పంపటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తు ఒలంపిక్స్​ని దృష్టిలో ఉంచుకుని క్రీడాకారులకు ఆహారం, ఆరోగ్యం సహా శిక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని... ఉస్మానియా వర్సిటీలో స్పోర్ట్స్ క్లస్టర్‌కు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఖేలో ఇండియా పథకం కింద కేటాయించిన నిధులతో ఓయూలో మహిళా స్విమ్మింగ్‌ పూల్, సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్‌, సింథటిక్ టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు.

భవిష్యత్తు క్రీడా ప్రతిభను ముందుకు తీసుకురావాలనేటటువంటిది మన ముందున్నటువంటి సమస్య. ఒలంపిక్స్​ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం.. టార్గెట్ ఒలంపిక్ పేరుతోటి మరి క్రీడాకారులకు అన్ని రకాలుగా అంతర్జాతీయ స్థాయిలో... హెల్త్ విషయంలో కావచ్చు, ఫిట్​నెస్ విషయంలో కావచ్చు... ఎక్విప్​మెంట్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా అన్ని క్రీడల్లో టాప్ స్కీం కింద అత్యంత ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్లను ఒలంపిక్స్​కు తయారు చేసేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం ప్రారంభించింది.

క్రీడాకారులుగా ఉన్నటువంటి వాళ్లు ఏ రంగంలోకి వెళ్లినా కూడా మెరుగైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తరు. కాబట్టి నేను ప్రతీ విద్యార్థిని కూడా కోరుతా ఉన్నాను. ఏదో ఓ ఆట... ఏదో ఒక స్పోర్ట్​లో ఎక్స్​పర్ట్ కాకపోయినా కూడా ప్రాక్టీస్ అనేది చేస్తా ఉంటే... జీవితంలో అది అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే విషయాన్ని నేనీ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.

- కిషన్‌రెడ్డి, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి

అంతర్జాతీయ స్థాయిలో మనదేశం క్రీడల్లో వెనకబడిపోతున్నందునే... కేంద్రం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. క్రీడలపై పట్టుంటే ఏ రంగాల్లోనైనా రాణించే అవకాశముంటుందని... అందుకోసం ప్రతి విద్యార్థి ఏదో ఆటపై పట్టు పెంచుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

గ్రామీణ స్థాయి నుంచి కూడా క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో... విలేజ్ లెవెల్ నుంచి మనం నేషనల్, ఇంటర్ నేషనల్ లెవెల్​ వరకు చేయడానికి ఇవాళ గొప్పగా ప్లానింగ్ జరుగుతా ఉంది. భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి క్రీడా పరిస్థితి తీసుకురావాలనే నెపంతో అవన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది. ఇటు రాష్ట్రంలో కాని, అటు కేంద్రంలో కాని సంయమనం చేసుకొని అత్యధిక నిధులు వచ్చేటట్టు గ్యారంటీ చేయాలని కోరుతున్న.

- శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి

ఇదీ చూడండి: Vanidevi: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సురభి వాణీదేవి

Last Updated :Aug 29, 2021, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.