ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ రాజీనామా తీసుకొస్తే కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: కిషన్​రెడ్డి

author img

By

Published : Jan 14, 2023, 8:03 PM IST

Updated : Jan 14, 2023, 8:10 PM IST

Kishanreddy
Kishanreddy

Kishanreddy Fires on KTR : రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని.. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్​ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి స్వీకరించారు. సీఎం కేసీఆర్‌ రాజీనామా తీసుకొస్తే.. కేటీఆర్‌తో చర్చించడానికి సిద్ధమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

Kishanreddy Fires on KTR : ఐటీ మంత్రి కేటీఆర్​పై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్​రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని కేటీఆర్‌ విసిరిన సవాల్​ను స్వీకరించిన ఆయన.. సీఎం కేసీఆర్‌ రాజీనామా తీసుకొస్తే కేటీఆర్‌తో చర్చించడానికి సిద్ధమని స్పష్టం చేశారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలే పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని కిషన్​రెడ్డి ఆరోపించారు. భారత్‌ ఆఫ్ఘనిస్తాన్​గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆక్షేపించారు.

తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదు: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా పత్రాన్ని రాసుకొని కేటీఆర్ వస్తే తాను చర్చకు సిద్ధమని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కిషన్​రెడ్డి సవాల్ విసిరారు. తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే దిగజారి కేటీఆర్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేటీఆర్ స్టేట్​మెంట్స్ తెలంగాణ ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. కుర్​కురే పంపిణీపై కేటీఆర్ మాట్లాడటం అనాథ చిన్నారులను అవమానించడమేనని కిషన్​రెడ్డి మండిపడ్డారు. భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌గా మారుతుందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని ఆక్షేపించారు. మమ్మల్ని తిట్టండి కానీ దేశ ప్రతిష్టను మాత్రం దిగజార్చవద్దని కిషన్​రెడ్డి హితవు పలికారు.

సీఎం కేసీఆర్‌ రాజీనామా తీసుకొస్తే... కేటీఆర్‌తో చర్చకు సిద్ధం: కిషన్​రెడ్డి

ఉదయం 9 గంటలకు వందేభారత్ ప్రారంభం..: వందే భారత్ రైలును రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వేగవంతంగా వెళ్లే విధంగా ఆధునిక సాంకేతికతతో వందే భారత్ రైలును రూపొందించారని చెప్పారు. 22 రైల్వేస్టేషన్​లలో ఆదివారం ఒక్కరోజు వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు ఆగుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును కేంద్రం ప్రారంభిస్తుందని వెల్లడించారు.

వర్చువల్​గా ప్రారంభించనున్న మోదీ : తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రెగ్యులర్‌ సర్వీసు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతుందని.. ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్‌లు 14 నుంచి మొదలవుతాయని దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఈనెల 15న సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలును ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మార్గంలో ఆదివారం మినహా వారానికి 6 రోజులు రైలు నడవనుంది. విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 5.45కు బయలుదేరి... మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ - విశాఖపట్నం రైలు సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, రాత్రి 11.30కి విశాఖపట్నం వస్తుంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 14, 2023, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.