ETV Bharat / state

పెట్రో ధరలు దేశంలోకెల్లా ఏపీలోనే అధికం.. లీటర్‌ ఎంతంటే..?

author img

By

Published : Dec 9, 2022, 10:46 AM IST

PETROL AND DIESEL RATES IN AP
PETROL AND DIESEL RATES IN AP

PETROL AND DIESEL RATES IN AP : దేశంలోనే పెట్రోల్​​, డీజిల్​ ధరలు ఏపీలోనే అధికంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఆగస్టు నుంచి నవంబరు మధ్య కాలంలో ఏపీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.111.87, డీజిల్‌ ధర లీటరుకు రూ.99.61 ఉందన్నారు. మరే రాష్ట్రంలోనూ ఈ ధరలు లేవన్నారు.

PETROL AND DIESEL RATES IN AP : పెట్రోల్, డీజిల్‌ ధరలు దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆగస్టు నుంచి నవంబరు మధ్యకాలంలో ఏపీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.111.87, డీజిల్‌ ధర లీటరుకు రూ.99.61 ఉందన్నారు. మరే రాష్ట్రంలోనూ ఈ ధరలు లేవని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో ఏపీతో పోల్చితే ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. దేశంలో అత్యల్ప ధరలు అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్నట్లు తెలిపారు. అక్కడ లీటర్‌ పెట్రోల్‌ రూ.84.10, డీజిల్‌ రూ.79.74లకు విక్రయిస్తున్నారని తెలిపారు.

ఇవీ చదవండి :

petrol rates in ap : సగటు జీవి జేబు కాలుస్తున్న పెట్రో ధరలు

'రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రో ధరలపై పన్ను తగ్గించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.