1.30 crore scholarship : హైదరాబాద్‌ విద్యార్థికి బంపర్​ ఆఫర్​.. రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

author img

By

Published : Aug 6, 2022, 6:49 AM IST

హైదరాబాద్‌ విద్యార్థికి బంపర్​ ఆఫర్​.. రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

1.30 crore scholarship for Hyderabad student: అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం హైదరాబాద్​కు చెందిన ఓ విద్యార్థికి బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనున్నట్లు అంగీకార పత్రాన్ని, స్కాలర్​షిప్ లేఖను విద్యార్థికి పంపింది. ఈ నెల 12న విద్యార్థి అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు.

1.30 crore scholarship for Hyderabad student: హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడేకు అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్‌ లేఖను పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్‌.. అమెరికాలో న్యూరోసైన్స్‌ చదవనున్నాడు.

విద్యార్థి వేదాంత్​ ఆనంద్​వాడే

విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్‌ అతడిని గుర్తించి.. తగిన మార్గదర్శకం చేసింది. ఈ నెల 12న వేదాంత్‌ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు. ఈ సందర్భంగా వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని, 17 మంది నోబెల్‌ పురస్కార గ్రహీతలను అందించిందని వేదాంత్​ పేర్కొన్నాడు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్‌ ఫీజు మేరకు స్కాలర్‌షిప్‌ లభించిందన్నారు. నాన్న ప్రైవేట్‌ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నారని వేదాంత్‌ తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.