ETV Bharat / state

Dharani Meeting: 'ధరణి'పై మంత్రివర్గ ఉప సంఘం భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ

author img

By

Published : Nov 10, 2021, 10:40 PM IST

Cabinate sub committee meeting on dharani portal
హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో మంత్రివర్గ ఉపసంఘం

ధరణి పోర్టల్​కు(dharani portal) సంబంధించిన ఫిర్యాదులపై మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) దృష్టి సారించింది. సమస్యలను పరిష్కారంపై చర్చించేందుకు హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో హరీశ్ రావు అధ్యక్షతన సమావేశమైంది. ధరణి ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం (cabinet sub committee)ఆదేశించింది.

ధరణిలో వచ్చే ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) ఆదేశించింది. ధరణి పోర్టల్​లో(dharani portal) వచ్చే సమస్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన బీఆర్కే భవన్​లో సమావేశమైంది. ధరణిలో ఉన్న సమస్యలు, ఫిర్యాదులు, వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించింది.

ఈ సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లపై వచ్చిన ఇబ్బందులపై మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) సమీక్షించింది. ధరణిలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరిస్తే ప్రజలకు, రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై ఈ నెల 17వ తేదీన మరోమారు సమావేశం నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం(cabinet sub committee) నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరీష్, హనుమంత రావు, ఆర్డీఓలు శ్రీనివాస్, కిషన్ రావు, క్రెడాయ్, ట్రెసా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

Dharani Portal News: ధరణి అమలెలా జరుగుతోంది? రెవెన్యూ ఆఫీసుల్లో అసలేం జరుగుతోంది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.