ETV Bharat / state

Bomb Threat to Hyderabad Airport : హైదరాబాద్​ ఎయిర్​పోర్టుకు బాంబు బెదిరింపు.. 'నా కుమారుడు పంపించాడంటూ..'

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 10:39 AM IST

Bomb Threat to Hyderabad Airport
Hyderabad Airport

Bomb Threat to Hyderabad Airport : హైదరాబాద్​లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు, బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వెతకగా ఎక్కడా బాంబు కనిపించలేదు. దీంతో బెదిరింపు మెయిల్ ఫేక్ అని అధికారులు నిర్ధారణకు వచ్చారు.

Bomb Threat to Hyderabad Airport : హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానాశ్రయంలో బాంబు ఉన్నట్లు మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెయిల్ రాగానే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సీఐఎస్​ఎఫ్(CISF) అధికారులు రంగంలోకి దిగారు. వారితో పాటు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కూడా బాంబు కోసం వెతికాయి.

Bomb Threat to Shamshabad Airport : దాదాపుగంట పాటు ఎయిర్​పోర్టు అంతా జల్లెడ పట్టిన బాంబు జాడ కనిపించలేదు. దీంతో బెదిరింపు మెయిల్ ఫేక్ అని అధికారులు నిర్ధారణకు వచ్చారు. terrorist@gmail.com నుంచి మెయిల్‌ విమానాశ్రయం ఆపరేషన్స్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చినట్టు బయటపడింది. దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మెయిల్​పై ఆరా తీయడం మొదలుపెట్టారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. "శంషాబాద్​ ఎయిర్​పోర్టులో బాంబు(Bomb Threat) పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చిందని విమానాశ్రయ అధికారులు మాకు సమాచారం అందించారు. డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్క్వాడ్​ను అప్రమత్తం చేసి మేం అక్కడికి వెళ్లాం. అందరం కలిసి దాదాపు గంటపాటు వెతికినా బాంబు కనిపించలేదు. ఇదే సమయంలో మరో మెయిల్ వచ్చింది. తన కుమారుడు మొబైల్ ఫోన్​తో ఆడుకుంటూ తెలియకుండా మెయిల్ పంపించాడని సదరు వ్యక్తి రెండో మెయిల్​లో తెలిపాడు. తప్పు జరిగిందని క్షమించమని అందులో కోరాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్నాం.

శంషాబాద్ విమానాశ్రయంలో టాక్సీల రాకపోకలకు సొరంగ మార్గం

Hyderabad Airport Bomb Threat : అయితే సదరు వ్యక్తి తప్పు జరిగిందని చెప్పాడు కానీ.. మెయిల్ ఐడీ మాత్రం terrorist@gmail.com అని ఉంది. కుమారుడు ఫోన్​తో ఆడుతూ తెలియకుండా పంపిస్తే ఇలాంటి ఐడీ ఎందుకు ఉంటుంది. ఆ అనుమానమే వచ్చింది. అతడికి మళ్లీ మెయిల్ చేస్తే స్పందన లేదు. అందుకే అతడి ఐటీ అడ్రస్ కనిపెట్టే పనిలో ఉన్నాం. వీలైనంత త్వరగా ఆ ఫేక్ మెయిల్ పంపించిందెవరో పట్టుకుంటాం. అది నిజంగా ఫేక్ మెయిలేనా.. లేక ఇందులో ఇంకా ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నాం." అని ఆర్జీఐ పోలీసులు తెలిపారు.

Shamshabad Airport Bomb Threat : ఎయిర్​పోర్టు(Hyderabad Airport News)లో బాంబు ఉందంటూ బెదిరింపు రావడం.. అధికారులు.. డాగ్, బాంబు స్క్వాడ్​.. పరుగులు పెడుతూ వెతకడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో అర్థంగాక ఆందోళన చెందారు. బాంబు పెట్టారన్న సమాచారం విని భయాందోళనకు గురయ్యారు. అయితే చివరి నిమిషంలో బాంబు లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత తమ గమ్యస్థానాలకు ప్రశాంతంగా బయల్దేరారు.

'ఎయిర్‌పోర్ట్ మెట్రో' వస్తే ఇలా ఉంటుంది.. ఓసారి ఈ వీడియో చూడండి..!

ఎయిర్‌పోర్టుకు మెట్రో గరిష్ఠ వేగం 120కిమీ.. సమయం 26 నిమిషాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.