ETV Bharat / state

దీక్షకు అడ్డంకులు.. కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం: బండి సంజయ్‌

author img

By

Published : Dec 26, 2021, 10:09 PM IST

bandi sanjay fire on govt: నిరుద్యోగ దీక్షకు పోలీసులు ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమైన చర్య అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నేతల నిర్బంధాన్ని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ నిబంధనలకు లోబడి దీక్ష చేస్తామంటే అభ్యంతరమెందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

bandi sanjay fire on govt
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

bandi sanjay fire on govt: నిరుద్యోగ దీక్షకు అడ్డంకులు సృష్టించడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మండిపడ్డారు. దీక్షతో పీఠం కదిలిపోతుందని కేసీఆర్‌ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా చేపట్టిన ‘నిరుద్యోగ దీక్ష’కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.

bandi sanjay Unemployment initiation: కొవిడ్ నిబంధనలకు లోబడి మా పార్టీ కార్యాలయంలో ‘నిరుద్యోగ దీక్ష’ చేపడుతుంటే ప్రభుత్వానికి అభ్యంతర ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ దీక్షతో కేసీఆర్​కు భయం పట్టుకుందని.. అందుకే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేపడుతున్న దీక్షకు రాకుండా విద్యార్థి నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?

bandi on unemployed youth: ఏళ్ల తరబడి ఉద్యోగాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉపాధి కరువై లక్షలాది మంది నిరుద్యోగ యువతీ, యువకులు అల్లాడుతున్నా కూడా కళ్లు లేని కబోదిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్త కంఠంతో ఖండించాలని సంజయ్ కోరారు. నిరుద్యోగ యువతీ, యువకుల పక్షాన భాజపా చేపడుతున్న దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను బండి సంజయ్​ విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.