ETV Bharat / state

పేపర్​ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలి: బండి సంజయ్‌

author img

By

Published : Mar 25, 2023, 1:20 PM IST

Bandi Sanjay Fires on KTR: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆయన రాజీనామా చేయకుంటే.. ముఖ్యమంత్రే బర్తరఫ్‌ చేయాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఆందోళనకు గురికావద్దని.. ప్రభుత్వం దిగి వచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదని మహాధర్నాలో స్పష్టం చేశారు.

Bjp
Bjp

Bandi Sanjay Fires on KTR: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన నిరుద్యోగుల మహా ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీని నిరసిస్తూ.. 'మా నౌకరీలు మాగ్గావాలే' నినాదంతో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వేదికగా ధర్నా నిర్వహిస్తున్నారు. బండి సంజయ్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ సహా ఇతర నేతలు పాల్గొన్నారు.

పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మహాధర్నా చేపట్టినట్లు సంజయ్ తెలిపారు. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహించి మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని.. ఆయన రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో ఇద్దరి ప్రమేయం ఉందని కేటీఆర్ చెప్పారని.. ఇద్దరే ఉన్నప్పుడు అంతమందిని ఎలా అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

'' లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో ఏళ్లుగా జరుగుతోంది. నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేటీఆర్ రాజీనామా చేయాలి. కేటీఆర్ రాజీనామా చేయకపోతే ముఖ్యమంత్రే బర్తరఫ్ చేయాలి. నేను లేని సమయంలో ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోయారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మహాధర్నా చేపట్టాం. ఇవాళ సిట్ అధికారులను పిలిచి నేనే నోటీసులు అందుకున్నా. ప్రశ్నాపత్రం లీకేజీలో ఇద్దరి ప్రమేయం ఉందని కేటీఆర్ చెప్పారు. ఇద్దరే ఉన్నప్పుడు ఇతరులను ఎలా అరెస్ట్ చేశారో కేటీఆర్‌ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తుంది.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది.'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

లీకేజీ వ్యవహారం కేసీఆర్ ప్రభుత్వంలో ఏళ్లుగా జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ఆరోపించారు. కేసీఅర్, కేటీఆర్ లీకేజీకి తమకు సంబంధం లేదంటున్నారని.. సంబంధం లేకపోతే అధికారంలోంచి దిగిపోండని అన్నారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగులతో చెలగాడమాటడం సిగ్గు చేటని మండిపడ్డారు.

317 జీవో తీసుకువచ్చి భార్యాభర్తలను విడదీశారని ఫైర్ అయ్యారు. బండి సంజయ్, బీజేపీ ఏమి తప్పు చేసిందని సిట్ నోటీసులు పంపించారని ప్రశ్నించారు. తప్పు చేసింది మీరైతే... నోటీసులు బీజేపీ నేతలకు పంపించడమేంటని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారులు బయటకు రావాలంటూ పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చిందని చేతులు ముడ్చుకుని కూర్చోకండని వ్యాఖ్యానించారు. ఇక ఈ బీజేపీ మహాధర్నాకు నిరుద్యోగులు హాజరై సంఘీభావం తెలిపారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.