ETV Bharat / state

Raghunandan Rao on Cm Kcr: 'కటౌట్లు పెట్టినంత మాత్రానా దేశ్​కీ నేత కాలేరు'

author img

By

Published : Feb 17, 2022, 3:36 PM IST

Raghunandan Rao on Cm Kcr: ప్రధాని మోదీని తిట్టినా కూడా సీఎం కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. శత్రువును కూడా గౌరవించే సంస్కారం తమదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Raghunandan
Raghunandan

Raghunandan Rao on Cm Kcr: తెలంగాణ సెంటిమెంట్​ను మరోసారి రగిల్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో తెరాస ఉన్నట్లు తాము భావిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోదీని తిట్టినా కూడా... ఆయన కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. తెలంగాణలో అలజడి సృష్టించే ప్రయత్నం తెరాస చేస్తోందనే అనుమానం కలుగుతోందన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశం అనే భావన తీసుకురావొద్దని ఆయన కోరారు. ఏ అంశంపైనా అయిన చర్చకు తాము సిద్ధమని మంత్రి హరీశ్​రావుకు సవాల్ విసిరారు. ఎయిమ్స్, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చామన్న రఘునందన్​రావు... శత్రువును కూడా గౌరవించే సంస్కారం తమదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు భాజపా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

భాజపా ఎంపీలు ఓటేస్తేనే...

భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రఘునందన్​రావు పలు అంశాలపై మాట్లాడారు. ఉత్తర భారత దేశానికి చెందిన భాజపా ఎంపీలు ఓటు వేస్తేనే తెలంగాణ బిల్లు పార్లమెంట్​లో పాస్ అయిందని గుర్తుచేశారు. సుష్మాస్వరాజ్ చెప్పిన మాట మీద నిలబడి తెలంగాణ కోసం ఉత్తర భారతదేశ ఎంపీలు అండగా ఆనాడు ఉన్నారన్నారు. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే నరేంద్రమోదీ గుజరాత్​కు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేది మర్చిపోవద్దని చురకలంటించారు. హరీష్ రావు ఎమ్మెల్యేనే... రఘునందన్ రావు కూడా ఎమ్మెల్యేనే స్థాయి ఏంటో చెప్పాలని కోరారు. తెలంగాణ కోసం బలిదానాలు 2009 నుంచే జరుగుతున్నాయన్నారు.

ప్రజల్లో నమ్మకం కోల్పోయినందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్​ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాధకరమైన విషయం. మన రాష్ట్రాల గురించి మాట్లాడరు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడతారు. మందికి పుట్టిన బిడ్డను మాది అని భాజపా వాళ్లు అంటారంటా. మీ జన్మదినం సందర్భంగా నేను సూటిగా అడుగుతున్న. ఇవాళ అయినా కనీసం నిజం మాట్లాడండి. ఎవరు మందికి పుట్టిన బిడ్డనో ఆలోచించండి. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్.. మద్దతుగా నిలిచింది భాజపా. ఆరోజు మీ సంఖ్య రెండు. ఓటింగ్​లో పాల్గొంది ఒకరు. వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్-భాజపా ఈ పార్టీలు నిర్ణయం తీసుకుంటే పుట్టిన బిడ్డ తెలంగాణ. ఇది మంది బిడ్డనా? మన బిడ్డనా?

-- రఘునందన్ రావు, ఎమ్మెల్యే

ఇండియాలో కలిపేస్తాం...

పాక్ ఆక్రమిత కశ్మీర్​ను అవకాశం రాగానే కలుపుతామని రఘునందన్​రావు అన్నారు. అఖండ భారత భూభాగం నుంచి విడిపోయిన అన్ని ప్రాంతాలను మళ్లీ భారతదేశంలో కలుపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని బలవంతంగా ఇండియాలో కలిపారు అని కవిత లోక్​సభలో అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇండియా గురించి భాజపా మాట్లాడితే కల్వకుంట్ల కుటుంబం గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెరాస పైసలతో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కటౌట్లు, ప్లెక్సీలు పెట్టినంత మాత్రానా దేశ్ కీ నేత కాలేరని ధ్వజమెత్తారు. ఇంటికి రూ. 10లక్షలు ఇచ్చినా తెరాసకు ఓట్లు పడటం లేదనే మళ్లీ సెంటిమెంట్​ను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

'కటౌట్లు పెట్టినంత మాత్రానా దేశ్​కీ నేత కాలేరు'

ఇదీ చూడండి: Birth Day Wishes to CM KCR : కేసీఆర్​కు వెల్లువలా జన్మదిన శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.