ETV Bharat / state

Raghunandan Rao Arrest : బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్టు

author img

By

Published : Jul 5, 2023, 1:27 PM IST

Updated : Jul 5, 2023, 2:33 PM IST

Raghunandan Rao Arrest In Hyderabad : గజ్వేల్‌లో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన కేసులో వాదించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోర్టుకు బయలుదేరారు. ఈ క్రమంలో ముందస్తుగా అల్వాల్‌ పోలీసులు హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ సమీపంలో రఘునందన్‌రావును అరెస్టు చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే అరెస్టుపై ఈటల రాజేందర్‌ స్పందించారు.

Raghunandan Rao
Raghunandan Rao

BJP MLA Raghunandan Rao Arrest In Hyderabad : ఇటీవల గజ్వేల్‌లో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసిన కేసులో వాదించేందుకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోర్టుకు బయలుదేరారు. ఈ క్రమంలో ముందస్తుగా అల్వాల్‌ పోలీసులు హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ సమీపంలో ఆయన వాహనాన్ని ఆపి పోలీసులు రఘునందన్‌రావును అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి గజ్వేల్ వైపు వెళ్తుండగా అరెస్ట్ చేసి.. పీఎస్‌కు తరలించామని అల్వాల్ ఎస్‌ఐ గంగాధర్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా రఘునందన్‌ను గజ్వేల్‌ వెళ్లకుండా అడ్డగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రఘునందన్ రావు అరెస్టు విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు.

రఘునందన్‌రావును విడుదల చేయాలని ఈటల డిమాండ్‌ : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును వెంటనే విడుదల చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అక్రమ నిర్భందాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈటల తెలిపారు. గజ్వేల్ వెళ్తున్న రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని అల్వాల్‌ పోలీసు స్టేషన్‌లో ఉంచారు. విషయం తెలుసుకున్న ఈటల రాజేందర్ అయనతో ఫోన్‌లో మాట్లాడారు. కేసు వాదించడానికి వెళ్లడం తప్పా అని పోలీసులను ప్రశ్నించారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్టు

"రెండు రోజుల క్రితం గజ్వేల్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో బాధితుల తరఫున వాదించేందుకు కోర్టుకు వెళుతుంటే పోలీసులు అరెస్టు చేశారు. ఆరోజు సకాలంలో గొడవకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు నిర్ణీత సమయంలో నిందితుడుని అరెస్టు చేసి ఉంటే ఘర్షణకు జరిగేది కాదు." - రఘునందన్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఆరోజు సకాలంలో పోలీసులు స్పందించలేదు : రెండు రోజుల క్రితం గజ్వేల్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో బాధితుల తరఫున వాదించేందుకు కోర్టుకు వెళుతున్న క్రమంలో అల్వాల్ పోలీసులు అరెస్టు చేసినట్లు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఆరోజు సకాలంలో గొడవకు దిగిన వారిని పోలీసులు అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఇరువర్గాల మధ్య గొడవ జరిగినట్లు ఆయన తెలిపారు. పోలీసులు నిర్ణీత సమయంలో నిందితుడుని అరెస్టు చేసి ఉంటే ఘర్షణకు తావు లేకుండా ఉండేదని ఆయన అన్నారు. ఘటనలో ఐదు మంది హిందువులను అకారణంగా అరెస్టు చేసి కరీంనగర్ జైలుకు పంపడం జరిగిందని వారి పక్షాన వాదించేందుకు వెళ్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్నారు. బాధితుల పక్షాన పోరాడి వారి న్యాయం చేయకూర్చే విధంగా కృషి చేస్తానని రఘునందన్‌రావు హామీ ఇచ్చారు.

బీజేపీ అధ్యక్ష పదవికి అర్హుడిని కానా? : కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఒక్కసారిగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను అర్హుడిని కానా అంటూ నాయకత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్‌ లీడర్‌లో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. ఆఖరికి జాతీయ అధికా ప్రతినిధి ఇచ్చినా సరిపెట్టుకుంటానంటూ చెప్పుకొచ్చారు. పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేశానని.. కొన్ని విషయాల్లో తనకు కులమే శాపం కావచ్చని అభిప్రాయపడ్డారు. దుబ్బాక ఎన్నికల్లో జాతీయ నేతలు తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌ బొమ్మలతో ఓట్లు రావని.. తనను చూసే ఓట్లు వేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా వచ్చే దుబ్బాక ఎన్నికలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

దుబ్బాకలో తనను చూసే గెలిపించారని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను బీజేపీలోనే ఉంటానని ప్రకటించారు. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. వందకోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలవలేదని ఆరోపించారు. అక్కడ గెలవకపోవడానికి బండి సంజయ్‌నే కారణమని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన సంజయ్‌.. వంద కోట్లతో యాడ్స్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జాతీయ నేతలు తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌ బొమ్మలతో ఓట్లు రావని ధ్వజమెత్తారు.

Last Updated :Jul 5, 2023, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.