ETV Bharat / state

Etela on TRS: కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా?: ఈటల

author img

By

Published : Jun 5, 2022, 3:37 PM IST

Updated : Jun 5, 2022, 3:47 PM IST

Etela on TRS: రాష్ట్రంలో పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. కేవలం ఆర్థిక సంఘం నిధులు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. నిధులు కేంద్రం ఇస్తుంటే ఫలితం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పొందుతోందని ఈటల విమర్శించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Etela on TRS
భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Etela on TRS: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం వెలవెలబోతుందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అందులో పాల్గొనేందుకు అధికారులు సైతం ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో సర్పంచులకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వస్తున్నాయని వెల్లడించారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిధులిచ్చింది లేదు. పల్లె, పట్టణ ప్రగతిలో ఎవరూ పాల్గొనే పరిస్థితి లేదు. సర్పంచులకు కేవలం ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వస్తున్నాయి. కేంద్రం ఇచ్చే గ్రాంట్లతోనే పనులు చేయాల్సిన పరిస్థితి ఉంది. నిధులు కేంద్రం ఇస్తుంటే.. ఫలితం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పొందుతోంది. - ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే

కేంద్రం నుంచి వచ్చే ఉపాధి హామీ నిధుల నుంచి 90 శాతం, 10 శాతం నిధులతో మాత్రమే గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని ఈటల ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాడుకుంటూ ఫలితం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పొందుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో చర్చకు సిద్ధమని ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. మహిళా సంఘాలను నిర్వీర్యం చేయవద్దని ఈటల విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలు 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మహిళ సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు తక్షణమే అందించాలని.. మహిళల ఉసురు పోసుకొవద్దు అని హితవు పలికారు.

కేంద్రం నిధులిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతోంది: ఈటల

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వీవోఏలకు జీతభత్యాలు పెంచలేదని... ప్రభుత్వ వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడితే.. మరికొందరు రాజీనామా చేశారని ఈటల ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు అతీ గతీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి బడ్జెట్​లో కేటాయింపులు చేస్తే 99 శాతం వాటిని విడుదల చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే పన్నులతో రాష్ట్రాలను అభివృద్ధి చేస్తోందని ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. రాష్ట్రాల అభివృద్ధితో పాటు అదనంగా రక్షణ, స్పేస్ రంగాలపై కేంద్రం ఖర్చు పెడుతుందన్నారు. రాష్ట్ర అధికారులను సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని ఈటల అసహనం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: అత్యాచారం చేసిన తరువాత నిందితులు ఎటు వెళ్లారంటే...

కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. 13 మంది ఎమ్మెల్యేలకు ఛాన్స్

Last Updated : Jun 5, 2022, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.