ETV Bharat / state

BJP Bus Yatra Plan in Telangana : ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో .. బీజేపీ బస్సు యాత్ర

author img

By

Published : Aug 15, 2023, 8:14 PM IST

BJP Bus Yatra Plan in Telangana : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్రకు కాషాయ దళం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 17న ప్రారంభించి.. అక్టోబర్ రెండున ముగించేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎన్నికల నిర్వాహణ కమిటీ ఛైర్మన్​ ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

BJP Latest Programme in Telangana
BJP Bus Yatra Schedule in Telangana

BJP Bus Yatra Plan in Telangana : గత శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పట్టణానికే పరిమితమైన పార్టీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లగలిగారు. అందుకు నిదర్శనమే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనీవినీ ఎరగని రీతిలో సత్తా చాటింది. బీఆర్​ఎస్​కు ప్రత్యామ్నాయం బీజేపీనేననే వాదన బలంగా వెళ్లింది.

BJP Bus Tour Way in Telangana : హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్​నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోను బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. బీజేపీ అంటే తెలియని ఊర్లో ప్రజా సంగ్రామ యాత్రతో కమిటీలు ఏర్పడిన పరిస్థితికి వచ్చింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న కాషాయ దండుకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తరువాత ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా పార్టీలో జోష్ తగ్గింది. పలువురు బహిరంగంగానే జాతీయ నాయకత్వాన్ని విమర్శించిన పరిస్థితి. అధిష్ఠానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఎన్నికలకు సమయం దగ్గరకి వస్తున్నందున.. పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో బస్సు యాత్ర చేపట్టాలని భావిస్తోంది.

BJP Telangana Election Plan 2023 : 35-40 సీట్లకు ముందే అభ్యర్థులు.. ఎన్నికలకు బీజేపీ పకడ్బందీ వ్యూహాలు

BJP Bus Tour Divided to 3 Cluster : ఉమ్మడి పది జిల్లాలను మూడు క్లస్టర్లుగా విభజించి బస్సు యాత్ర చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. యాత్రకు సంబంధించి పార్టీ రాష్ట్ర ఇంచార్జీ, ఎన్నికల కమిటీ సహా ఇంచార్జీ సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వానికి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణ బాధ్యత వహించిన వీరేందర్ గౌడ్, దీపక్ రెడ్డి, పాపారావు, విక్రమ్ గౌడ్​లకు బస్సు యాత్ర నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టింది. మూడు క్లస్టర్లలో ప్రారంభమయ్యే యాత్రను దీపక్ రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించింది.

BJP Bus Yatra First Cluster Leader : ఆదిలాబాద్ నుంచి ఒక బస్సు యాత్ర, గద్వాల నుంచి ఒక బస్సు యాత్ర, భద్రాచలం నుంచి ఒక బస్సు యాత్ర ప్రారంభించేలా ప్లాన్ చేస్తోంది. ఈ మూడు యాత్రలకు రాష్ట్ర పార్టీ కీలక నేతలు సారథ్యం వహించనున్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఒక్కో యాత్రకు నేతృత్వం వహించనున్నారు. ఈ ముగ్గురు నేతల్లో ఎవరూ ఏ క్లస్టర్​కు నాయకత్వం వహించేది స్పష్టత రావాల్సి ఉంది. పదిహేను రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ప్రతి ఒక్క బస్సు యాత్ర ప్రతి రోజూ రెండు అసెంబ్లీ కేంద్రాల్లోకి వెళ్లేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

BJP Leaders Join in BJP Bus Tour : ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. కేసీఆర్ సర్కారు వైఫల్యాలపై ధ్వజమెత్తుతునే ప్రధాని మోదీ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేంద్ర సహాయంపై ప్రజలకు వివరించనున్నారు. యాత్రలపేరుతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.

Independence Day Celebrations in BJP Office : 'కేసీఆర్​ కుటుంబం మరోసారి అధికారంలోకి వస్తే.. తెలంగాణ అధోగతి పాలు'

Telangana BJP 2023 Elections Plan : 'పార్టీ బలహీనంగా ఉన్న చోట త్వరితగతిన బలోపేతం చేయాలి'

BJP Demand TS Government on Heavy Rains : "ప్రజలు వరదల్లో కొట్టుకుపోతుంటే.. కేసీఆర్​ రాజకీయాల్లో మునిగిపోయారు"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.