ETV Bharat / state

'హైదరాబాద్​ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచించాలి'

author img

By

Published : Mar 12, 2020, 7:53 PM IST

'హైదరాబాద్​ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచించాలి'
'హైదరాబాద్​ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచించాలి'

హైదరాబాద్​ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచించాలని కేంద్ర మంత్రి జావడేకర్​ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కోరారు. ఈ పరిశ్రమ వల్ల చుట్టుపక్కల గ్రామాలు కాలుష్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ ఏర్పాటుపై కేంద్రం ఓ కమిటీ వేయాలని విన్నవించారు.

హైదరాబాద్​ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచన చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జావడేకర్​ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కోరారు. ​ఇవాళ దిల్లీలో కేంద్ర మంత్రిని కోమటిరెడ్డి కలిశారు. ఫార్మా సిటీ వల్ల చుట్టుపక్కల గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని విన్నవించారు. భూగర్భ జలాలు, గాలి కాలుష్యం అవుతాయని వివరించారు.

bhuwanagiri-mp-komatireddy-venkatreddy-met-central-minister-javadekar-in-delhi
'హైదరాబాద్​ ఫార్మా సిటీ అనుమతులపై పునరాలోచించాలి'

కమిటీ వేయండి:

ప్రధానంగా చిట్యాల, పోచంపల్లి, చౌటుప్పల్, తదితర గ్రామాలపై ఫార్మా కంపెనీల ప్రభావం ఎక్కువగా పడుతుందని కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ ఏర్పాటుపై కేంద్ర పర్యావరణ శాఖ అధికారులతో ఓ కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ స్వయంగా ఫార్మా సిటీ ప్రాంతాన్ని సందర్శించి నివేదిక రూపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ నివేదిక ఆధారంగానే హైదరాబాద్ ఫార్మా సిటీకి అనుమతులు ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: కిస్​కా జాగీర్ నహీ.. కిస్​ కా బాప్​కా బీ నహీ: భట్టీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.