ETV Bharat / state

bathukamma 2021: రవాణాశాఖలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

author img

By

Published : Oct 13, 2021, 3:35 PM IST

bathukamma celebrations 2021
రవాణాశాఖలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

11:54 October 13

bathukamma celebrations 2021

రవాణాశాఖలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో బతుకమ్మ పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించారు. రవాణాశాఖలో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. ఎప్పుడూ విధి నిర్వహణలో ఉండే ఉద్యోగులకు బతుకమ్మ ఆడటం సంతోషాన్నిచ్చిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

మహిళా ఉద్యోగులందరూ కలిసి.. సంతోషంతో బతుకమ్మ ఆడడం మరిచిపోలేమని అనుభవమని పేర్కొన్నారు. బతుకమ్మ ఆడుకునేందుకు రవాణాశాఖ అధికారులు ఫ్లడ్​లైట్లను ఏర్పాటు చేశారు. రవాణాశాఖ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు, జేటీసీ పాండురంగానాయక్​లతో పాటు ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Bathukamma 2021 special: మీకు తెలుసా.. బతుకమ్మను పేర్చడానికి ఆ పూలే ఎందుకు వాడతారో?

Saddula Bathukamma celebrations: సద్దుల బతుకమ్మకు సర్వం సిద్ధం.. కానీ ఇవాళా, రేపా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.