ETV Bharat / state

ఈ నెల 28 నుంచి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర.. ఎక్కడి నుంచంటే.?

author img

By

Published : Nov 16, 2022, 7:52 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay Chit Chat: ఈనెల 28 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ముథోల్ నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర ఉంటుందని తెలిపారు. దిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్​నే చేర్చుకోలేదు.. కవితను ఎట్లా చేర్చుకుంటామని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ ఏ యుద్ధం చేసినా తాము సిద్ధమని.. తాము ముందే యుద్ధం ప్రారంభించామని తెలిపారు. మోదీ సభతో కేసీఆర్‌ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో భయం మొదలైందని వ్యాఖ్యానించారు.

Bandi Sanjay Chit Chat: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం జరిగిన తెరాస విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. దిల్లీ చుట్టూ తిరిగిన కేసీఆర్​నే చేర్చుకోలేదు.. అలాంటిది కవితను ఎలా చేర్చుకుంటామని సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌లో భయం మొదలైందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే గుర్తించారన్నారు. కేసీఆర్‌ ఏ యుద్ధం చేసినా తాము సిద్ధమని.. కేసీఆర్‌ కంటే ముందే యుద్ధం ప్రారంభించామని తెలిపారు. ఈనెల 28 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లనంటే.. వెళ్తారనే: ముథోల్ నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర ఉంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. భైంసాలో పాదయాత్ర ప్రారంభ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇవాళ వివిధ అంశాలపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని బండి వివరించారు. భాజపా బలోపేతం కాకుండా అడ్డుకోవాలి.. తెరాస గెలవాలని కేసీఆర్‌ చెబుతున్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్న వాళ్లను ఏ చెప్పుతో కొట్టాలని ప్రశ్నించారు. కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లనంటే.. వెళ్తారనే అర్థమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌ టెక్నాలజీని తెలంగాణకు తీసుకువచ్చింది ఎవరని ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేరు చెబితే కేసీఆర్‌ మొహం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ఎమ్మెల్యేలకు లేదు: కేసీఆర్‌ నిన్న పెట్టిన సమావేశం చూసి మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలోనే తెరాసకు కార్యకర్తలు లేరు.. దేశం మొత్తం ఎలా పోటీ చేస్తారని సంజయ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము ఎమ్మెల్యేలకు లేదన్న ఆయన.. ఎక్కడ చూసినా తెరాస నాయకుల కబ్జాలే అని మండిపడ్డారు. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డగోలుగా సంపాదించారని కేసీఆర్‌కు తెలుసని బండి ఆరోపించారు. డెక్కన్‌ కిచెన్‌ సీసీ ఫుటేజ్‌ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థను కేసీఆర్‌ దారుణంగా తయారు చేశారని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ భాజపాకు మద్దతు తెలపాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ ఏ యుద్ధం చేసినా తాము సిద్ధం: తెలంగాణలో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీల నాయకులు అమ్ముడుపోతే కార్యకర్తలు భాజపాలో చేరండని సూచించారు. మోదీ సభతో కేసీఆర్‌ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో భయం మొదలైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఏ యుద్ధం చేసినా తాము సిద్ధమని.. కేసీఆర్‌ కంటే ముందే యుద్ధం ప్రారంభించామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్లు.. అదే తమ లక్ష్యమని బండి సంజయ్‌ వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.