ETV Bharat / state

కరోనా మృతుల కుటుంబాలకు తెరాస ఆర్థిక సాయం

author img

By

Published : May 16, 2021, 7:23 PM IST

కరోనాతో మరణించిన కార్యకర్తల కుటుంబాలకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆర్థిక​ సాయం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

balka suman helped party activist's families who died with corona
కరోనా మృతుల కుటుంబాలకు తెరాస ఆర్థిక సాయం

కరోనాతో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్​ జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రి, రామకృష్ణాపూర్​లో మరణించిన నాయకుల కుటుంబాలను బాల్క సుమన్​ పరామర్శించారు. కుటుంబసభ్యులను వివరాలు అడిగి తెలుసుకొని ఓదార్చారు.

అనంతరం సంపత్, రాజ్ కుమార్ కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న శ్రేణులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఇవీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.