ETV Bharat / state

Olympics 2021: మీరాబాయి చానుకు ఏపీ గవర్నర్, సీఎం జగన్​ అభినందనలు

author img

By

Published : Jul 24, 2021, 8:48 PM IST

Updated : Jul 24, 2021, 8:53 PM IST

Olympics 2021
Olympics 2021

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్​లో రజతం గెలిచిన మీరాభాయి ఛానును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆ రాష్ట్ర సీఎం జగన్ అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్​లో రజతం సాధించిన మీరాభాయి ఛానును ఆంధ్రప్రదేశ్ గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్ అభినందించారు. తొలి పతకం గెలవటంపై దేశమొత్తం గర్విస్తోందని ట్వీట్ చేశారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో ఓ​ పతకం చేరటం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్​ హర్షం వ్యక్తం చేశారు. రజత పతకం సాధించిన మీరాబాయి చానును జగన్​ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మిగతా క్రీడాకారులు కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒలింపిక్ క్రీడల్లో ప్రారంభమైన భారత ప్రదర్శనను చూడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మీరా భాయి ఛాను 49 కేజీల విభాగంలో రజత పతకం గెలిచారు.

భారత్​కు తొలి పతకం..

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు తొలి పతకాన్ని మీరాబాయి చాను సాధించిపెట్టింది. మహిళల 49 కేజీల విభాగంలో.. వెయిట్​ లిఫ్టల్​ మీరాబాయి చాను రజతం గెల్చుకుంది. ఒలింపిక్స్​లో రజత పతకం సాధించిన భారత తొలి వెయిట్​ లిఫ్టర్​గా ఘనత సాధించింది. స్నాచ్‌లో 87 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115 కిలోలు ఎత్తింది. మొత్తంగా 202 కిలోలు ఎత్తి భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది.

ఇవీ చూడండి:

Last Updated :Jul 24, 2021, 8:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.