ETV Bharat / state

ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకే.. 'ఎనీ టైమ్ బ్యాగ్'

author img

By

Published : Apr 12, 2023, 1:59 PM IST

Any time bag vending machine in Hyderabad: దైనందిన జీవితంలో భాగమైన ప్లాస్టిక్‌ వాడకంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విచ్చలవిడిగా పెరిగిన ప్లాస్టిక్‌ వినియోగంతో భూమి, నీరు కలుషితమవుతూ జంతు జీవజాలానికి నష్టం కలిగిస్తోంది. పుడమికి హాని తలపెట్టే ప్లాస్టిక్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు.. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ కోవలోనే ప్లాస్టిక్‌ రహిత చేతి సంచులందించేందుకు హైదరాబాద్‌లో ఎనీ టైమ్‌ బ్యాగ్‌ వెండింగ్‌ మెషీన్‌ ఏర్పాటైంది. మరీ ఈ ATB గురించి మనమూ తెలుసుకుందామా..?

ATB services started in Hyderabad
హైదరాబాద్​లో మొదలైన ఏటీబీ సేవలు

ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకు హైదరాబాద్​లో ఏటీబీ సేవలు

Any time bag vending machine in Hyderabad: పూర్వం మన పెద్దలు సామాను తెచ్చుకునేందుకు చేతి సంచులు వాడేవారు. ద్రవ రూప వస్తువులు కోసం డబ్బాలు, సీసాలు ఉపయోగించేవారు. ప్రస్తుతం మారిన జీవన శైలితో వాటి స్థానంలోకి ప్లాస్టిక్‌ వచ్చి చేరింది. రోజురోజుకు పెరుగుతున్న ప్లాసిక్‌ భూతం వల్ల అన్నిరకాల నష్టం జరుగుతోంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు మనిషి మనుగడకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఆ విషయాన్ని గమనించిన ప్రభుత్వాలు.. స్వచ్ఛంద సంస్థలు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిద్దామంటూ.. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

ప్లాస్టిక్​ వాడకాన్ని తగ్గించేందుకే ఈ పథకం: అనేక సంస్థలు పర్యావరణ హిత ఉత్పత్తుల తయారీపై ప్రయోగాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే జనపనార బ్యాగులు, అరటికాండం వంటి జీవ ఉత్పత్తులతో సంచులను తయారు చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ సంచుల వాడకాన్ని తగ్గించేందుకు ఐడీపీఎల్​ పండ్ల మార్కెట్‌లో జ్యూట్‌ బ్యాగులను అందించే ఎనీటైమ్‌ బ్యాగ్‌ మెషీన్‌ని ఏర్పాటు చేశారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మెవాటే, యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ సంస్థలు.. ఆ ఏటీజీ యంత్రాన్ని అందించాయి.

ఒకసారి 500 సంచులను పెట్టే సామర్థ్యం ఉంది: సోలార్‌ శక్తితో నడిచే ఆ యంత్రంలో పదిరూపాయల నోటు లేదా రెండు రూ.5 కాయిన్లు వేసి 8 కిలోల బరువు తట్టుకునే వస్త్ర సంచి తీసుకోవచ్చు. ఒకేసారి 500 సంచుల వరకు పెట్టే సామర్థ్యం ఉన్న యంత్రాన్ని క్యూ ఆర్‌ కోడ్‌తోనూ డబ్బు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ వ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఏటీజీలని ఏర్పాటుచేసి ఉపాధికల్పించనున్నట్లు జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు. ఆ పరికరం ద్వారా ప్లాస్టిక్‌ సంచుల వాడకం తగ్గించే ఆస్కారం ఉండటంతో కొనుగోలు దారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"పసిపిల్లల నుంచి వృద్దులు వరకు ప్లాస్టిక్​ వాడకుండా ఉండేందుకే ఈ బ్యాగులను తీసుకువచ్చాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ యంత్రాన్ని మాకు అందించాయి. జీహెచ్​ఎంసీ కూడా మాకు సహకరించింది. పేద కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి మా ప్రయత్నం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మెషీన్​ను మాకు అందించిన మెవాటే, యునైటెడ్​ వే ఆఫ్​ హైదరాబాద్ సంస్థలకు, జీహెచ్​ఎంసీకి ధన్యవాదాలు." - మధులత, మహిళా సమైఖ్య సంఘం అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.