ETV Bharat / state

ఈ నెల 28న తెలంగాణకు అమిత్​ షా రాక - షెడ్యూల్​ ఇదే

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 7:17 PM IST

Updated : Dec 26, 2023, 7:52 PM IST

Amit shah telangana tour Schedule : వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమాయత్తం అవుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ రానున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు పార్లమెంట్​ ఎన్నికలపై దిశానిర్ధేశం చేయనున్నారు.

BJP Leaders Meeting in Hyderabad
Amit Shah Telangana Tour

Amit Shah Telangana Tour Schedule : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit shah) తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 12:05కి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోని అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లనున్నారు. అనంతరం 12:20 నుంచి 1:45 వరకు ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలతో చర్చించనున్నారు.

Amit Shah Telangana Tour Schedule : శంషాబాద్​లో హోటల్‌ నుంచి 1:50కి కొంగరకలాన్‌ శ్లోక కన్వెన్షన్​కు బయల్దేరి వెళ్లనున్నారు. 2:10 నుంచి సాయంత్రం 4:30 వరకు జరిగే రాష్ట్ర విస్తృత సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. సమావేశం అనంతరం తిరిగి శంషాబాద్‌ హోటల్‌కు చేరుకుంటారు. రాష్ట్ర పర్యటనను ముగించుకుని 5:45కి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి తిరిగి దిల్లీకి వెళ్లనున్నారు.

తెలంగాణ పార్లమెంట్​ ఎన్నికల్లో డబుల్​ డిజిట్​తో గెలుస్తాం : కిషన్​రెడ్డి

Amit shah Meeting to Telangana BJP Leaders : దేశంలో పార్లమెంట్​ ఎన్నికలు వచ్చే ఏడాది నాలుగో నెలల్లో జరగునున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తమ నాయకులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్నా పార్టీ ప్రముఖ నాయకులకు అగ్ర నేతలు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ(BJP) గెలుపు దిశగా పయనించేందుకు నాయకులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికంగా సీట్లు రాకపోయినా, ఓట్ల శాతం పెరిగిందని పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

BJP Leaders Meeting in Hyderabad : ప్రజలు బీజేపీ నాయకత్వం కోరుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు తెలుపుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో డబుల్​ డిజిట్​లో గెలుస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. ఇప్పటికే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు లోక్​సభ స్థానాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అందులో హైదరాబాద్​లో జరిగే సమావేశానికి అమిత్ షా రానున్నారు.

వ్యూహం అంటే ఇది కదా- సీఎంల ఎంపికలో మోదీ, షా మార్క్- '2024లో అధికారం బీజేపీదే!'

Parliament Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, అధిక మెజారిటీతో గెలిచేందుకు పార్టీ నాయకులకు అమిత్​ షా పలు సూచనలు ఇవ్వనున్నారు.

Amit Shah Reached Hyderabad : హైదరాబాద్​లో అమిత్ షా.. పీవీ సింధుతో భేటీ..

Amit Shah Telangana Tour : సెప్టెంబర్ 17న తెలంగాణకు అమిత్ షా

Last Updated : Dec 26, 2023, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.