అమెరికాలో వర్సిటీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

author img

By

Published : May 11, 2022, 4:58 PM IST

అమెరికాలో వర్సిటీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

America Professor Interview: టెక్‌ ప్రపంచానికి మారు పేరు.. అమెరికా. సాఫ్ట్‌వేర్‌ కొలువుల కోసం ఏటా ఎంతో మంది విద్యార్థులు అమెరికా గడప తొక్కుతుంటారు. పీజీ, పీహెచ్‌డీలు పూర్తి చేసి అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. మరి అలాంటి అమెరికాలో కొవిడ్‌ తరవాత చదువులు, ఉద్యోగాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి. యూనివర్సిటీని ఎంచుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మంచి రీసెర్చ్‌ సదుపాయాలు, సాఫ్ట్‌వేర్‌ కోర్సులపై అవగాహన ఎలా.. ఇలాంటి సందేహాలను వివరిస్తున్న అమెరికా ప్రొఫెసర్‌ హరి కల్వతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

"అమెరికాలో మరో పదేళ్ల పాటు కంప్యూటర్ కోర్సులకే డిమాండ్ కొనసాగుతుంది. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్​తో పాటు రానున్న తరం కోర్సులు వర్చువల్ రియాల్టీ, మెటావర్స్​కు బాగా డిమాండ్ ఉంటుంది. యూనివర్సిటీని ఎంచుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి రీసెర్చి సదుపాయాలు, ఉద్యోగావకాశాలు ఉంటే వాటిలో చేరాలి. కొవిడ్​ ఆంక్షలు ఎత్తివేయడంతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడేందుకు విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. గతేడాది మెుత్తం అన్‌లైన్‌లోనే తరగుతులు నిర్వహణ జరిగింది. వ్యాక్సినేషన్‌, కేసుల తగ్గుదలతో తరగతులు తిరిగి ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో తెలుగు విద్యార్థులు అమెరికాకు వెళ్తున్నారు.టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు యూనివర్సిటీల కోర్సులను ముందే తెలుసుకుని చేరాలి. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఉన్న యూనివర్సిటీల ఎంపిక మంచిది." -ప్రొఫెసర్ హరి కల్వ, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ

అమెరికాలో వర్సిటీని ఎంచుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.