ఆన్​లైన్​ గేమ్స్​ ఎఫెక్ట్​.. బ్యాంకు నుంచి నగదుతో క్యాషియర్‌ పరారీ..

author img

By

Published : May 11, 2022, 12:15 PM IST

Updated : May 11, 2022, 3:05 PM IST

cash theft in bank of baroda at vanasthalipuram

12:13 May 11

వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం

cash theft in bank of baroda at vanasthalipuram
నిందితుడు ప్రవీణ్​

Robbery in Bank of Baroda: బ్యాంకులో క్యాషియర్​ ఉద్యోగం. అనుకూలమైన పనివేళలతో.. ఒత్తిడి లేని బిందాస్​ జీవితం. పండుగలు, పబ్లిక్​ హాలిడేస్​, వారాంతపు సెలవులు. ఇలా అనుకుంటూ ఎంతో హుషారుగా జాబ్​లో చేరాడు ఆ ఉద్యోగి. ఇక రోజూ ఎంతో ఉల్లాసంగా కస్టమర్ల నోట్ల కట్టలను లెక్కపెట్టుకుంటూ.. అకౌంట్స్​ అన్నీ ట్యాలీ చేసుకుంటూ విధులను సక్రమంగా నిర్వరిస్తూ ఉన్నాడు. కానీ ఇంతలోనే ఓ మాయదారి వ్యసనం అతడిని చుట్టుముట్టుంది. ఆన్​లైన్​ గేమ్స్​. వీటి బారిన పడితే ఇక వాటి నుంచి బయటపడటం కష్టమే. మనోడు కూడా వీటికి బీభత్సంగా బానిసయ్యాడు. అంతే.. లాభాలు వస్తాయనుకున్న చోట తీరని నష్టాలు చవిచూశాడు. దీంతో అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని ఎలా తీర్చాలో దిక్కుతోచడం లేదు. అంతే ఎంతటి మంచివాడినైనా డబ్బు ఇట్టే మార్చేస్తుంది అన్నట్లుగా.. రోజూ నోట్ల కట్టలు కళ్ల ముందే జిగేల్​మని కనిపిస్తుంటే.. అతని మనసు ఊరుకోలేదు. తన అప్పులు తీరడానికి ఆ క్యాషియర్​ ఉద్యోగమే దిక్కనుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఆ నోట్ల కట్టల వైపే అతని దృష్టంతా. ఎలాగైనా వాటిని కాజేయాలని చూశాడు.

తిన్నింటికే కన్నం: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని భావించాడేమో.. అందుకే తిన్నింటికే కన్నం వేయాలని పథకం వేశాడు. అందుకు సమయం కోసం ఎదురుచూశాడు. అదీ లక్షో రెండు లక్షలో అనుకుంటే పొరపాటే.. ఏకంగా పెద్దమొత్తానికే టార్గెట్​ పెట్టుకున్నాడు. చడీచప్పుడు కాకుండా రూ. 22.53 లక్షలు బ్యాగులో సర్దుకున్నాడు. ఇక తప్పించుకోవడమే తరువాయి. మెల్లగా బయటకు వెళుతున్నానని మధ్యాహ్న సమయంలో డబ్బుతో సహా పరారయ్యాడు. హైదరాబాద్​లోని ఓ బ్యాంకులో క్యాషియర్ నిర్వాకం ఇది.

ఆరోగ్యం బాగాలేదని: హైదరాబాద్​ వనస్థలిపురం పోలీస్​స్టేషన్​ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్ నగర్ బ్రాంచ్​లో క్యాషియర్ తన చేతివాటం ప్రదర్శించాడు. అధికారుల కళ్లు గప్పి రూ. 22 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లాడు. బ్యాంకులో గత కొంత కాలంగా క్యాషియర్​గా పనిచేస్తున్న ప్రవీణ్.. మంగళవారం మధ్యాహ్నం ఆరోగ్యం బాగాలేదని మందుల కోసం బయటకు వెళ్లి వస్తానని అధికారుల అనుమతి అడిగాడు. వారు అనుమతి ఇవ్వడంతో ఎవరికీ అనుమానం రాకుండా.. రూ. 22 లక్షల 53 వేల నగదుతో పరారయ్యాడు.

సమయం దాటినా బ్యాంకుకు తిరిగి రాకపోవడం, లెక్కల్లో తేడా రావడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. క్యాషియర్ ప్రవీణ్​పై అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రవీణ్ ఫోన్ స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులను, తోటి బ్యాంకు సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రవీణ్ ఆన్​లైన్​ గేమ్​లకు బానిసై పెద్ద మొత్తంలో డబ్బులు పోవడంతో ఆ అప్పులను తీర్చడం కోసం బ్యాంకులోని నగదును తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి: దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే

Asani Effect On Telangana: తెలంగాణపై అసని ఎఫెక్ట్.. అక్కడ భారీ వర్షాలు​

Last Updated :May 11, 2022, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.