ETV Bharat / state

జైల్లో రేవంత్ రెడ్డిని కలిసిన పలువురు నాయకులు

author img

By

Published : Mar 16, 2020, 4:23 PM IST

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిని ములాఖత్ పద్ధతిలో పలువురు నాయకులు కలిశారు. రేపు హైకోర్టులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశముందని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి పేర్కొన్నారు.

some of the leaders meet Revanth Reddy in jail at cherlapally
జైల్లో రేవంత్ రెడ్డిని కలిసిన పలువురు నాయకులు

హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో తెజస అధ్యక్షుడు కోదండరాం ములాఖత్ అయ్యారు. తనతో పాటు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు ఎంపీని కలిశారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు పెట్టిన సెక్షన్లు ఏ ఒక్కటి సరిగ్గా లేదని, అదనపు సెక్షన్లు యాడ్ చేయడం దారుణమని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి కానీ, ఏ తప్పు చేయకున్నా శిక్ష అనుభవించడమేంటని దుయ్యబట్టారు.

ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదన్నారు. రేపు హైకోర్టులో రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశముందని, చాలామంది జైలుకు వచ్చే సూచలున్నాయన్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం వలన ఎక్కడివారు అక్కడే సంబరాలు జరుపుకోవాలని సూచించారు. వచ్చినవారు మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

జైల్లో రేవంత్ రెడ్డిని కలిసిన పలువురు నాయకులు

ఇదీ చూడండి : కరోనా కోసం గచ్చిబౌలి స్టేడియం శుభ్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.