ETV Bharat / state

AGNIPATH PROTEST LIVE UPDATES: ఆందోళనకారుల దాడిలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం: ఎస్పీ అనురాధ

author img

By

Published : Jun 17, 2022, 2:02 PM IST

Updated : Jun 17, 2022, 10:15 PM IST

AGNIPATH PROTEST IN TELANGANA LIVE UPDATES
AGNIPATH PROTEST IN TELANGANA LIVE UPDATES

22:13 June 17

సికింద్రాబాద్ స్టేషన్‌లో అల్లర్లపై రైల్వే ఎస్పీ అనురాధ ప్రకటన

  • సికింద్రాబాద్ స్టేషన్‌లో అల్లర్లపై రైల్వే ఎస్పీ అనురాధ ప్రకటన
  • ఆందోళనకారుల దాడిలో రూ.20 కోట్ల ఆస్తి నష్టం: ఎస్పీ అనురాధ
  • పోలీసు కాల్పుల్లో ఒకరు మృతి, 12 మందికి గాయాలు: ఎస్పీ అనురాధ
  • ఆందోళనకారుల దాడిలో 8 రైళ్లు ధ్వంసం: ఎస్పీ అనురాధ
  • ఆందోళనకారుల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలు: ఎస్పీ అనురాధ
  • ఉదయం 9 గం.కు 300 మంది ఒకేసారి ప్లాట్‌ఫాం పైకి వచ్చారు: ఎస్పీ
  • తర్వాత గ్రూపులుగా 2 వేల మంది ప్లాట్‌ఫాం పైకి వచ్చారు: ఎస్పీ అనురాధ
  • అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ప్లాట్‌ఫాంపై నినాదాలు చేశారు: ఎస్పీ అనురాధ
  • కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు : ఎస్పీ అనురాధ
  • ప్లాట్‌ఫాంలోని దుకాణాలపై దాడులు చేశారు: ఎస్పీ అనురాధ
  • ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జరిపారు: ఎస్పీ
  • పాత పద్ధతిలోనే ఆర్మీ నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు: ఎస్పీ
  • హరియాణా, బిహార్‌ తరహా దాడుల దృష్ట్యా ఇక్కడా రైళ్లపై దాడులు: ఎస్పీ
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఇప్పటికీ ఆందోళనకారుల నిరసన: ఎస్పీ అనురాధ
  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఇంకా 150 మంది నిరసన: ఎస్పీ అనురాధ

21:06 June 17

'అగ్నిపథ్' పథకం అనాలోచిత, పిచ్చి చర్య: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

  • 'అగ్నిపథ్' పథకం అనాలోచిత, పిచ్చి చర్యగా అభివర్ణించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
  • దేశ భవిష్యత్‌కు, రక్షణకు 'అగ్నిపథ్' గొడ్డలిపెట్టన్న శ్రీనివాస్‌గౌడ్
  • మోదీ అనాలోచిత నిర్ణయాలపై సీఎం కేసీఆర్‌ పోరాడుతున్నారని వ్యాఖ్య
  • మృతుడు రాకేశ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీనివాస్‌గౌడ్‌
  • మృతుడు రాకేశ్‌ కుటుంబానికి కేంద్రం పరిహారం ప్రకటించాలని డిమాండ్
  • ఘటనలో గాయపడిన శ్రీకాంత్‌ తండ్రిని పరామర్శించిన శ్రీనివాస్‌గౌడ్‌
  • కేంద్రం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

21:03 June 17

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనపై రేవంత్‌రెడ్డి ట్వీట్‌

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనపై రేవంత్‌రెడ్డి ట్వీట్‌
  • సికింద్రాబాద్‌లో కాల్పుల్లో విద్యార్థి రాకేశ్‌ మృతి బాధాకరం: రేవంత్‌రెడ్డి
  • ఇది భాజపా- తెరాస ప్రభుత్వాలు చేసిన హత్య: రేవంత్‌రెడ్డి
  • రాకేశ్‌ హత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి: రేవంత్‌రెడ్డి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: రేవంత్‌రెడ్డి

20:15 June 17

ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకున్న కాకినాడ వెళ్లే రైలు

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి షెడ్యూల్‌ రైళ్ల ప్రారంభం
  • ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌ వద్దకు చేరుకున్న కాకినాడ వెళ్లే రైలు

20:12 June 17

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు
  • ఇండియన్ రైల్వే యాక్ట్‌తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
  • కేసు వివరాలు వెల్లడించిన రైల్వే ఎస్పీ అనురాధ
  • రైల్వే ఉద్యోగి రాజా నర్సు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు: ఎస్పీ
  • సికింద్రాబాద్‌ ఘటన కేసు దర్యాప్తు చేయాల్సి ఉంది: ఎస్పీ అనురాధ
  • సుమారు 1,500 మంది దాడిలో పాల్గొన్నారు: ఎస్పీ అనురాధ
  • ఆందోళనకారుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు: ఎస్పీ
  • రైల్వే ఆస్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు: ఎస్పీ అనురాధ
  • ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై అనూహ్యంగా దాడి చేశారు: ఎస్పీ
  • ఆందోళనకారులు బోగీలు తగలబెట్టడంతో పాటు రాళ్ల దాడి చేశారు: ఎస్పీ
  • పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నాం: ఎస్పీ అనురాధ
  • రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం: ఎస్పీ
  • మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం: ఎస్పీ
  • వీలైనంత త్వరగా పరిస్థితులను చక్కదిద్దుతాం: ఎస్పీ అనురాధ

19:26 June 17

దామెర రాకేశ్‌ మృతికి నిరసనగా రేపు నర్సంపేట నియోజకవర్గం బంద్‌

  • దామెర రాకేశ్‌ మృతికి నిరసనగా రేపు నర్సంపేట నియోజకవర్గం బంద్‌
  • నర్సంపేట నియోజకవర్గ బంద్‌కు పిలుపిచ్చిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌
  • 'అగ్నిపథ్‌'ను ప్రశ్నిస్తే హత్య చేస్తారా?: పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • రేపు నియోజకవర్గ బంద్‌లో అందరూ పాల్గొనాలి: పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ బంద్‌కు సహకరించాలి: పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • మృతుడు రాకేశ్‌ దబ్బీర్‌పేట రైతుసమితి కోఆర్డినేటర్ కుమారుడు
  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్‌

19:13 June 17

సికింద్రాబాద్​లో తగ్గిన అలజడి.. కాసేపట్లో రైల్వే సర్వీసులు పునఃప్రారంభం!

  • సికింద్రాబాద్​లో సాధారణ పరిస్థితులు..
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • రైల్వే స్టేషన్​ను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు
  • కాసేపట్లో పునఃప్రారంభం కానున్న రైల్వే సర్వీసులు

18:37 June 17

'అగ్నిపథ్‌'ను పునఃసమీక్షించాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్

  • 'అగ్నిపథ్‌'ను పునఃసమీక్షించాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
  • ఆర్మీ ఉద్యోగార్థులను వంచించే విధంగా కేంద్రం నిర్ణయం: కేటీఆర్‌
  • అగ్నిపథ్‌పై ఆందోళనలు దేశంలో నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనం: కేటీఆర్‌
  • కేంద్రం కళ్లుతెరిచి అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్
  • ఏకపక్షంగా, నియంతృత్వ నిర్ణయాల వల్లే దుష్పరిణామాలు: కేటీఆర్‌
  • దేశంలో జరుగుతున్న అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత: కేటీఆర్‌
  • సాగు చట్టాలతో కేంద్రం రైతులను ఇబ్బందులకు గురిచేసింది: కేటీఆర్‌
  • కేంద్రప్రభుత్వం ఇప్పుడు జవాన్లను నిర్వేదంలోకి నెడుతోంది: కేటీఆర్‌
  • అగ్నిపథ్‌పై నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుంటాం: కేటీఆర్‌
  • సికింద్రాబాద్‌లో యువకుడి మృతికి కేంద్రమే బాధ్యత వహించాలి: కేటీఆర్‌
  • వన్ ర్యాంక్- వన్ పెన్షన్ నుంచి.. నో ర్యాంక్- నో పెన్షన్ స్థాయికి దిగజార్చారు: కేటీఆర్‌
  • అగ్నిపథ్‌తో నాలుగేళ్ల తర్వాత 75 శాతం నిరుద్యోగులుగా మారతారు: కేటీఆర్‌
  • దేశ భద్రత కన్నా ఆర్థికపరమైన అంశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు: కేటీఆర్‌
  • పెన్షన్ డబ్బులను ఆదా చేసేందుకు చౌకబారు ఎత్తుగడే ఈ విధానం

18:35 June 17

మెట్రో రైల్ సర్వీసులు పునః ప్రారంభం

  • హైదరాబాద్‌: మెట్రో రైలు సర్వీసులు పునఃప్రారంభం
  • మెట్రో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించిన రైల్వే అధికారులు
  • సికింద్రాబాద్ ఘటన దృష్ట్యా ఉదయం నుంచి నిలిచిపోయిన మెట్రో రైళ్లు

18:31 June 17

ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తత, భారీగా బలగాల మోహరింపు
  • ఆందోళనకారులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
  • దాదాపు 40 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఉదయం నుంచి రైల్వేస్టేషన్‌లో పట్టాలపై బైఠాయించిన ఆందోళనకారులు
  • ఆందోళనలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయిన రాకపోకలు
  • మూడు రైళ్లలోని బోగీలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మోహరించిన వందల మంది పోలీసులు

17:43 June 17

'అగ్నిపథ్' సరిగ్గా ప్రణాళిక చేయని పథకం: ఎంపీ ఉత్తమ్‌

  • 'అగ్నిపథ్' సరిగ్గా ప్రణాళిక చేయని పథకం: ఎంపీ ఉత్తమ్‌
  • 'అగ్నిపథ్' సాయుధ దళాలలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ వంటిది: ఉత్తమ్‌
  • 'అగ్నిపథ్' అనేది లోపభూయిష్ట పథకం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • మోదీ ప్రభుత్వం దేశ భద్రతపై రాజీపడింది: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  • అగ్నిపథ్ ఒక అనాలోచిత, పేలవమైన ప్రణాళిక: ఎంపీ ఉత్తమ్‌

17:02 June 17

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో కొనసాగుతున్న ఆందోళన..

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో కొనసాగుతున్న ఆందోళన..
  • రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలుపుతున్న యువకులు
  • ఆర్మీ నియామక పరీక్ష విషయంలో స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటున్న యువకులు
  • 100 మందికి పైగా యువకులు రైలు పట్టాలపై బైఠాయింపు

16:59 June 17

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిన మంత్రి కేటీఆర్

  • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిన మంత్రి కేటీఆర్
  • వ్యవసాయచట్టాలు రైతులకు అర్థం కావు: మంత్రి కేటీఆర్‌
  • జీఎస్టీ వ్యాపారులకు అర్థం కాదు: మంత్రి కేటీఆర్‌
  • పెద్దనోట్ల రద్దు సామాన్యులకు అర్థం కాదు: కేటీఆర్‌
  • సీఏఏ ముస్లింలకు అర్థం కాదు: మంత్రి కేటీఆర్‌
  • ఎల్పీజీ ధరలు హోంమేకర్లకు అర్థం కాదు: మంత్రి కేటీఆర్‌
  • ఇపుడు అగ్నిపథ్‌ యువతకు అర్థం కాదు: మంత్రి కేటీఆర్‌
  • కేవలం విశ్వగురుకు మాత్రమే ఆ అర్థం తెలిసుండాలి: కేటీఆర్‌

16:38 June 17

'డిమాండ్లను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. ఆందోళన విరమించండి'

  • చట్టాన్ని ధిక్కరించవద్దని హితవు చెబుతున్న పోలీసు అధికారులు
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే భవిష్యత్తు దెబ్బతింటుంది: పోలీసులు
  • ఆందోళన విరమించాలని కోరుతున్న పోలీసు ఉన్నతాధికారులు
  • డిమాండ్లను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్న పోలీసులు
  • ఏఆర్‌వో తమ వద్దకు రావాలని పట్టుబడుతున్న యువకులు
  • సైనిక పరీక్ష అనేది ఆర్మీ అధికారులు తీసుకునే నిర్ణయం: పోలీసులు
  • సైనికుల పరిధిలోని విషయాలపై మేం హామీ ఇవ్వలేం: అధికారులు
  • చర్చలు కార్యాలయంలో జరగాలి.. ట్రాక్‌పై కాదు..: పోలీసు అధికారులు
  • చర్చలకు అందరూ వస్తామని చెబుతున్న ఆందోళనకారులు
  • చర్చలకు ఇద్దరు మాత్రమే రావాలని కోరిన పోలీసు అధికారులు

16:36 June 17

AGNIPATH PROTEST: కాల్పుల్లో మృతిచెందిన యువకుడి కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి సంతాపం

  • సికింద్రాబాద్ ఘ‌ట‌న‌పై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు విచారం
  • కాల్పుల్లో మృతిచెందిన యువకుడి కుటుంబానికి ఎర్రబెల్లి సంతాపం
  • క్షత‌గాత్రుల‌కు వైద్యులు మెరుగైన వైద్యమందించాలి: ఎర్రబెల్లి
  • మృతుడి కుటుంబానికి కేంద్రం పరిహారం చెల్లించాలి: ఎర్రబెల్లి
  • యువత సంయ‌మ‌నంతో శాంతియుతంగా పోరాడాలి: ఎర్రబెల్లి

16:22 June 17

చర్చలకు రావాలని ఆందోళనకారులను కోరిన పోలీసులు

  • సికింద్రాబాద్: చర్చలకు రావాలని ఆందోళనకారులను కోరిన పోలీసులు
  • ఆందోళనకారులకు నచ్చజెబుతున్న పోలీసు అధికారులు
  • చర్చలకు ఇద్దరు రావాలని కోరిన పోలీసు అధికారులు
  • చర్చలకు అందరం వస్తామని చెబుతున్న ఆందోళనకారులు
  • ఆందోళన విరమించాలని కోరుతున్న పోలీసు అధికారులు
  • ఏఆర్‌వో తమ వద్దకు రావాలని కోరుతున్న యువకులు

16:21 June 17

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన

  • అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన
  • సికింద్రాబాద్ కాల్పుల ఘటనను ఖండిస్తూ సీపీఎం నిరసన ప్రదర్శన
  • అగ్నిపత్ పథకం దేశ భద్రతకు విఘాతం: బీవీ రాఘవులు
  • అగ్నిపత్ పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి: బీవీ రాఘవులు
  • అగ్నిపథ్‌పై నిపుణులతో సమగ్రంగా చర్చించాలి: బీవీ రాఘవులు
  • ఆర్మీ నియామకాలను పాత పద్ధతిలోనే కొనసాగించాలి: బీవీ రాఘవులు
  • కాల్పుల్లో మరణించిన యువకుడి కుటుంబానికి పరిహారమివ్వాలి: రాఘవులు
  • సైనిక వ్యవస్థలో కాంట్రాక్టు పద్ధతి అమలు చేయడం సరికాదు: బీవీ రాఘవులు

15:39 June 17

ఇవాళ సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలు ఉండవని సమాచారం

  • రణరంగంగా కనపడుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కీలక వస్తువులు ధ్వంసం
  • రైల్వే పట్టాలపై చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు
  • గూడ్స్‌ నుంచి ద్విచక్రవాహనాలు దించి తగులపెట్టిన నిరసనకారులు
  • పలు ఎలక్ట్రిక్ పరికరాలు ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • పాడైన రైల్వే సామగ్రి మరమ్మతులకు సమయం పట్టే అవకాశం
  • ఇవాళ సికింద్రాబాద్ నుంచి రైళ్ల రాకపోకలు ఉండవని సమాచారం

15:30 June 17

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై స్పందించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై స్పందించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
  • రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతిచెందడం బాధాకరం: ప్రశాంత్‌రెడ్డి
  • మొన్న రైతులను.. నేడు యువకులను రోడ్డున పడేశారు: ప్రశాంత్‌రెడ్డి
  • దేశానికి సేవ చేయాలనే యువతను భాజపా అవమానిస్తోంది: ప్రశాంత్‌రెడ్డి
  • ఓటు బ్యాంకు రాజకీయమే దేశవ్యాప్త అల్లర్లకు కారణం: ప్రశాంత్‌రెడ్డి
  • బండి సంజయ్ వంటి నేతల వల్లే దేశంలో అశాంతి, అభద్రత: ప్రశాంత్‌రెడ్డి
  • ఆందోళన చేస్తున్న యువత సంయమనం పాటించాలి: ప్రశాంత్‌రెడ్డి

15:15 June 17

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా ప్రయాణికులకు హెల్ప్‌లైన్‌

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్తతల దృష్ట్యా ప్రయాణికులకు హెల్ప్‌లైన్‌
  • రైల్వే అధికారులను సంప్రదించాల్సిన నంబర్‌: 040-27786666

14:47 June 17

అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదు: కిషన్‌రెడ్డి

  • అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టించే ప్రయత్నం మంచిది కాదు: కిషన్‌రెడ్డి
  • సికింద్రాబాద్‌లో ఘటన పథకం ప్రకారం కుట్ర చేసి విధ్వంసం సృష్టించారు: కిషన్‌రెడ్డి
  • ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావన పెంచే ప్రయత్నంలో భాగంగానే అగ్నిపథ్‌: కిషన్‌రెడ్డి
  • ప్రపంచంలో అనేక దేశాల్లో అగ్నిపథ్‌ వంటి పథకాలు ఏళ్లుగా అమలవుతున్నాయి: కిషన్‌రెడ్డి
  • స్వచ్ఛందంగా ఇష్టపడినవాళ్లే ఈ పథకంలో చేరవచ్చు.. బలవంతం కాదు: కిషన్‌రెడ్డి
  • ఇజ్రాయిల్‌లో 12 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది: కిషన్‌రెడ్డి
  • ఇరాన్‌లో 20 నెలలపాటు సైన్యంలో పనిచేసే సంప్రదాయం ఉంది: కిషన్‌రెడ్డి
  • యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఆరేళ్ల నుంచి అమలు చేస్తున్నారు: కిషన్‌రెడ్డి
  • భారత్‌లో తప్పనిసరి చేయట్లేదు... ఇష్టం ఉన్నవాళ్లే చేరుతున్నారు: కిషన్‌రెడ్డి
  • దేశ సేవ చేయాలన్న తపన ఉన్నవాళ్లే అగ్నిపథ్‌లో పాల్గొంటారు: కిషన్‌రెడ్డి
  • అగ్నిపథ్‌ వీరుడు బయటకు వచ్చాక పదిమందికి ఉపాధి కల్పించేలా తయారవుతారు: కిషన్‌రెడ్డి
  • మోదీ ప్రధాని కాకముందు నుంచే చర్చలు జరుగుతున్నాయి: కిషన్‌రెడ్డి
  • కేంద్ర ప్రభుత్వం వాలంటరీ పథకం తీసుకొస్తే దాడులు జరగడం దురదృష్టకరం: కిషన్‌రెడ్డి
  • ప్రయాణికులు సామాన్లు కూడా వదిలిపెట్టి భయంతో పరిగెత్తే పరిస్థితి: కిషన్‌రెడ్డి
  • పథకం ప్రకారం కుట్ర చేసి రైల్వేస్టేషన్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం దారుణం: కిషన్‌రెడ్డి

14:16 June 17

కేంద్రం 'అగ్నిపథ్‌' ప్రకటనతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు

  • కేంద్రం 'అగ్నిపథ్‌' ప్రకటనతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు
  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళనకర పరిస్థితి
  • పోలీసులు, రైళ్లపై రాళ్లదాడి చేసిన ఆందోళనకారులు
  • గాలిలోకి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు
  • సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • రైలు బోగీల అద్దాలను కర్రలతో ధ్వంసం చేసిన ఆందోళనకారులు
  • రైల్వే స్టేషన్‌లో బైక్‌లు, స్టాళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి నిప్పంటించిన ఆందోళనకారులు
  • అగ్నిపథ్ రద్దుచేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్
  • సికింద్రాబాద్‌: ఆందోళనలో ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
  • మృతుడు వరంగల్‌ జిల్లాకు చెందిన దామోదర్‌ రాకేశ్‌గా గుర్తింపు

13:58 June 17

AGNIPATH PROTEST LIVE UPDATES:

  • గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
  • వీహెచ్‌ను లోపలికి అనుమతించని పోలీసులు
  • గాంధీ ఆసుపత్రి ఎదుట భైఠాయించిన వి.హన్మంతరావు

13:58 June 17

  • సికింద్రాబాద్‌ ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి వరంగల్‌ జిల్లావాసిగా గుర్తింపు
  • మృతుడు వరంగల్‌ జిల్లాకు చెందిన దామోదర్‌ రాకేశ్‌గా గుర్తింపు

13:57 June 17

  • హైదరాబాద్‌: నాంపల్లి రైల్వేస్టేషన్ మూసివేత
  • హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లే ప్రయాణికులకే అనుమతి
  • హుస్సేన్ సాగర్ రైలు ప్రయాణికులకు మాత్రమే అనుమతి
  • కేవలం మధ్యాహ్నం 2.55 కు ఉన్న ప్రయాణికులకే అనుమతి

13:57 June 17

  • సికింద్రాబాద్‌ ఘటనపై ఆరాతీస్తున్న కేంద్రం
  • సికింద్రాబాద్‌లో పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న కేంద్రం

13:57 June 17

  • సికింద్రాబాద్ ఘటనలో గాయపడిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స
  • గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 13 మంది బాధితులకు చికిత్స

13:56 June 17

  • హైదరాబాద్‌: భాజపా రాష్ట్ర కార్యాలయం మార్గంలో రహదారులు మూసివేత
  • భాజపా కార్యాలయానికి దారితీసే మార్గాల్లో అదనపు బందోబస్తు

13:56 June 17

  • సికింద్రాబాద్‌ ఘటన దృష్ట్యా 66 ఎంఎంటీఎస్‌ (సబర్బన్‌) సర్వీసులు రద్దు
  • ఆరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు, 4 రైళ్లు పాక్షికంగా రద్దు
  • ఇప్పటివరకు రెండు రైళ్లు దారిమళ్లించిన అధికారులు
  • ఆందోళనల దృష్ట్యా హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు
  • అన్ని మార్గాల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మెట్రో ఎండీ

13:56 June 17

  • సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళన
  • ఆందోళనకారులతో రైల్వే అధికారులు, పోలీసుల చర్చలు
  • ఆందోళన విరమించాలని కోరుతున్న రైల్వే పోలీసులు
  • సమస్య పరిష్కారమయ్యేవరకు విరమించేది లేదన్న ఆందోళనకారులు

13:56 June 17

  • ఆందోళనలతో పాతబస్తీలో పోలీసుల బందోబస్తు
  • సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా
  • చార్మినార్ వద్ద భద్రత ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న అధికారులు

13:56 June 17

  • ఆందోళనల దృష్ట్యా హైదరాబాద్‌లో మెట్రో రైళ్లు రద్దు
  • అన్ని మార్గాల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మెట్రో ఎండీ

13:56 June 17

  • ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే 12ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు
  • లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే 13 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
  • ఆందోళనల దృష్ట్యా ఇవాళ ఒక్కరోజు రాకపోకలు నిలిపివేత
  • వివరాలు వెల్లడించిన కాచిగూడ స్టేషన్ డైరెక్టర్ ప్రభుచరణ్

13:56 June 17

  • దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కిషన్‌రెడ్డి భేటీ
  • సికింద్రాబాద్‌ ఘటనపై అమిత్‌షాకు వివరించిన కిషన్‌రెడ్డి

13:55 June 17

  • హైదరాబాద్‌లో 6 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు
  • సికింద్రాబాద్-ధన్‌పూర్‌, హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లు రద్దు
  • హావ్‌డా-సికింద్రాబాద్‌ రైలు మౌలాలిలో నిలిపివేత
  • సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ రైలు మౌలాలిలో నిలిపివేత
  • గుంటూరు-వికారాబాద్‌ రైలు చర్లపల్లిలో నిలిపివేత
  • సికింద్రాబాద్‌-రేపల్లె రైలు పాక్షికంగా రద్దు
  • మరికొన్ని రైళ్లు దారిమళ్లించిన అధికారులు
  • షిర్డీసాయినగర్‌-కాకినాడ పోర్టు రైలు దారిమళ్లింపు
  • భువనేశ్వర్‌-ముంబయి సీఎస్‌టీ రైలు దారిమళ్లింపు

13:55 June 17

  • సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రికి వెళ్లేందుకు విద్యార్థులయత్నం
  • చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రి వైపు పరుగులు

13:55 June 17

  • తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి రాత్రే హైదరాబాద్‌ వచ్చిన యువకులు
  • 'అగ్నిపథ్' ప్రకటన నుంచి నిరసనకు ప్రణాళిక చేసిన ఆందోళనకారులు
  • వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారాన్ని చేరవేసిన ఆందోళనకారులు
  • జిల్లాలవారీగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్న ఆందోళనకారులు
  • సికింద్రాబాద్ స్టేషన్‌లో నిరసనకు నిన్న రాత్రే వచ్చిన ఆందోళనకారులు
  • స్టేషన్ బయట ఓ బస్సు అద్దాలు పగులగొట్టిన యువకులు
  • ఉ. 9 గం.కు ఒక్కసారిగా స్టేషన్‌లోకి దూసుకొచ్చిన ఆందోళనకారులు
  • స్టేషన్‌లో ఉన్న రైళ్ల కిటికీ అద్దాలు పగులగొట్టిన ఆందోళనకారులు
  • రెండు రైళ్లలోని రెండు బోగీలకు నిప్పుపెట్టిన యువకులు
  • అదనపు బలగాలపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు
  • రాళ్లు రువ్వడంతో యువకులపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు

13:55 June 17

  • సికింద్రాబాద్-ధన్‌పూర్‌, హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ రైళ్లు రద్దు
  • హైదరాబాద్‌లో 6 ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దు

13:55 June 17

  • సికింద్రాబాద్‌లో ఉద్రిక్తతతో రాష్ట్రంలోని రైల్వేస్టేషన్లలో భారీ బందోబస్తు
  • నాంపల్లి, కాజీపేట, జనగామ రైల్వేస్టేషన్లలో బలగాల మోహరింపు
  • డోర్నకల్‌, మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్లలో బలగాల మోహరింపు
  • నాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద పటిష్ట భద్రత, బలగాల మోహరింపు
  • నాంపల్లి స్టేషన్‌లోకి ఎవరినీ అనుమతించని పోలీసులు

13:54 June 17

  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో పోలీసులు, రైళ్లపై ఆందోళనకారుల రాళ్లదాడి
  • గాలిలోకి కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు
  • తోపులాటలో పలువురు ఆందోళనకారులకు గాయాలు
  • ఆందోళనలో ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
  • మృతిచెందిన వ్యక్తి నిర్మల్‌కు చెందిన దామోదర్‌ కురేషియాగా గుర్తింపు
  • గాయపడిన ఆందోళనకారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స
  • సికింద్రాబాద్ స్టేషన్‌లో రైళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • రైలు బోగీల అద్దాలను కర్రలతో ధ్వంసం చేసిన యువకులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బైక్‌లకు నిప్పుపెట్టిన నిరసనకారులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని స్టాళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దుకాణాలు, డిస్‌ప్లే బోర్డులు ధ్వంసం
  • రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి ఆందోళనకారుల నిరసన
  • రైలు ముందు పార్సిల్ సామాను వేసి నిప్పంటించిన ఆందోళనకారులు
  • అగ్నిపథ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన
  • అగ్నిపథ్ రద్దుచేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్

13:54 June 17

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారుల బీభత్సం
  • హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు నిప్పు
  • ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • ఆందోళనకారుల దాడిలో పూర్తిగా దగ్ధమైన రైలు బోగీ
  • రైలు బోగీల అద్దాలను కర్రలతో ధ్వంసం చేసిన యువకులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బైక్‌లకు నిప్పుపెట్టిన నిరసనకారులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని స్టాళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దుకాణాలు, డిస్‌ప్లే బోర్డులు ధ్వంసం
  • సికింద్రాబాద్: రైలు పట్టాలపై నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి యువకుల నిరసన
  • రైలు ముందు పార్సిల్ సామాను వేసి నిప్పంటించిన యువకులు
  • సికింద్రాబాద్‌: పోలీసులు, రైళ్లపై రాళ్లదాడి చేస్తున్న యువకులు
  • సికింద్రాబాద్‌: గాలిలోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు
  • తోపులాటలో పలువురు యువకులకు గాయాలు
  • రైళ్లపై రాళ్లు వేయడంతో పరుగులు తీసిన ప్రయాణికులు
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిన రైళ్ల రాకపోకలు
  • పట్టాలపై ఉన్న నిరుద్యోగులను పక్కకు తప్పిస్తున్న పోలీసులు
  • అగ్నిపథ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన
  • అగ్నిపథ్ రద్దుచేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్
  • రైల్వేస్టేషన్‌లో మోహరించిన ఉత్తర, తూర్పు, పశ్చిమ మండల పోలీసులు

13:51 June 17

LIVE UPDATES

  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారుల బీభత్సం
  • రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి యువకుల నిరసన
  • సికింద్రాబాద్: రైలు పట్టాలపై నిప్పుపెట్టిన యువకులు
  • రైలు ముందు పార్సిల్ సామాను వేసి నిప్పంటించిన ఆందోళనకారులు
  • సికింద్రాబాద్‌: పోలీసులు, రైళ్లపై రాళ్లదాడి చేస్తున్న యువకులు
  • రైళ్లపై రాళ్లు వేయడంతో భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
  • సికింద్రాబాద్‌ స్టేషన్‌లోని స్టాళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్లే రైలుకు నిప్పు
  • ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పుపెట్టిన ఆందోళనకారులు
  • రైలు బోగీల అద్దాలను కర్రలతో ధ్వంసం చేసిన యువకులు
  • అగ్నిపథ్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన
  • అగ్నిపథ్ రద్దుచేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో నిలిచిన రైళ్ల రాకపోకలు
  • పట్టాలపై ఉన్న నిరుద్యోగులను పక్కకు తప్పిస్తున్న పోలీసులు
  • రైల్వేస్టేషన్‌లో మోహరించిన ఉత్తర, తూర్పు, పశ్చిమ మండల పోలీసులు
Last Updated : Jun 17, 2022, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.