ETV Bharat / state

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఏబీవీపీ పోరుబాట..

author img

By

Published : Mar 26, 2022, 3:58 PM IST

ABVP Protest
ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆందోళన

ABVP Protest: రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆందోళన

ABVP Protest: ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకారవేతనాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. తెరాస సర్కార్‌ ఏడేళ్ల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిందని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. పేద బడుగు, బలహీనవర్గాలకు సంజీవనిగా ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించకుండా విద్యకు దూరం చేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

మెదక్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఈ క్రమంలో ఏబీవీపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఏబీవీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులు చెల్లించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడుతామని నేతలు హెచ్చరించారు. పోలీసులు ఏబీవీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు.

హనుమకొండలో కలెక్టరేట్​ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో పలువురుకి స్వల్ప గాయాలయ్యాయి. ఏబీవీపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పెద్దపల్లిలో విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.