ETV Bharat / state

చాక్లెట్​ రూపంలో గంజాయి తరలింపు.. మాదాపూర్​లో సీజ్​

author img

By

Published : Oct 27, 2021, 10:47 PM IST

ganja seized
ganja seized

హైదరాబాద్​ మాదాపూర్​లో ఓ కారులో తరలిస్తున్న 3.5 కిలోల గంజాయి పట్టుబడింది. ఖానామేట్​లో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. చాక్లెట్​ రూపంలో తరలిస్తున్న గంజాయి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

రాష్ట్రంలో గుప్పుమంటున్న గంజాయి రవాణాపై పోలీసులు నిఘా పెంచారు. హైదరాబాద్​ మాదాపూర్​ ఖానామేట్​లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు 3.5 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఓ కారులో చాక్లెట్​ రూపంలో తరలిస్తున్న గంజాయిని సీజ్​ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నామని శేరిలింగంపల్లి ఎక్సైజ్​ సీఐ గాంధీ నాయక్​ తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి.. రిమాండ్​కు తరలించామన్నారు. గంజాయిని చాక్లెట్​ రూపంలో విక్రయిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

మేడ్చల్​లో పట్ష్​ ఆయిల్​పట్టుబడింది
మేడ్చల్​లో పట్టుబడిన ఆశిష్​ ఆయిల్​

పట్టుబడ్డ ఆశిష్​ ఆయిల్​

మేడ్చల్ జిల్లాలో మరోసారి భారీ మొత్తంలో గంజాయి ఆశిష్ ఆయిల్ పట్టుబడింది. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో చింతల్ పాపయ్య నగర్ లోని ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని.. అతడి ఇంట్లో సోదాలు చేయగా.. 215 గంజాయి ఆశిష్ ఆయిల్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు 5ఎంఎల్​ సీసాను రూ.10వేలకు విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్​ విజయ్ భాస్కర్ తెలిపారు. నిందితుడి నుంచి ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకుని రిమాండ్​కు తరలించారు. మరో కేసులో బాలానగర్ ఎక్సైజ్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్లంబండలోని మరో వ్యక్తి వద్ద 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

పూజా సామగ్రి తయారీ ముసుగులో..

పూజాసామగ్రి వస్తువుల తయారీ ముసుగులో గుట్కా, పొగాకు ఉత్పత్తులు తయారు చేసి సరఫరా చేస్తున్న ముఠాను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని గోపాలపురం డివిజన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి అయిదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దాదాపు రూ.44 లక్షలు విలువైన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఏసీపీ సుధీర్ స్పష్టం చేశారు.

మూడు రోజుల్లో 70కి పైగా కేసులు

ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మత్తుపదార్థాల నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి విస్పష్ట ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖల అధికారులు మత్తు దందాపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్‌, గంజాయి విక్రేతలు, సరఫరాదారుల సమాచారం సేకరించి వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే మూడ్రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లోని 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు 70కి పైగా కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి: Police on drugs: డ్రగ్స్​ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ప్రత్యేక నిఘాతో అరెస్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.