ETV Bharat / state

AP corona cases: ఏపీలో కొత్తగా 244 కరోనా కేసులు, ఇద్దరు మృతి

author img

By

Published : Feb 22, 2022, 6:27 PM IST

AP Covid Cases
AP Covid Cases

AP corona cases: ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో ఇద్దరు మరణించారు.

AP corona cases: ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 18,803 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ సోకి ఇద్దరు మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 662 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 5,565 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 13వేల మందికి పాజిటివ్​

దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 14వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 13,405 కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో 235 మంది మరణించారు. 34,226 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది.

ఇదీ చూడండి : Ramya Money Collection : నటుడు నరేశ్​ పేరుచెప్పి డబ్బులు వసూలు చేస్తున్న మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.