ETV Bharat / state

పురపాలక శాఖలో 2,298 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం

author img

By

Published : Aug 21, 2020, 10:56 PM IST

రాష్ట్రంలోని పుర‌పాలిక‌ల్లో ప్ర‌భుత్వం నూత‌న విధానానికి శ్రీకారం చుట్టింది. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు పాల‌న మ‌రింత చేరువ చేయాల‌ని నిర్ణ‌యించిం‌ది. అందులో భాగంగా అన్ని మున్సిపాలిటీల్లో వార్డు అధికారులను నియ‌మించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. వారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ప‌నిచేయ‌నున్నారు. ఈ మేరకు పురపాలక శాఖలో 2,298 నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

2,298 new posts in the Municipal Department in telangana
పురపాలక శాఖలో 2,298 కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం

తెలంగాణలోని పుర‌పాలిక‌ల్లో ప్ర‌భుత్వం నూత‌న విధానానికి శ్రీకారం చుట్టింది. పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, క్యాబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ప్రగతి భవన్​లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుర‌పాల‌క శాఖ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. పోస్టుల రేషనలైజేషన్, ఖాళీల భర్తీపైన ఆరుసార్లు అంతర్గతంగా సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన అనంతరం.. తుది నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ 2,298 కొత్త ఖాళీలను భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగుల హేతుబద్ధీకరణ చేయాలన్న.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పురపాలకశాఖ అంతర్గతంగా చర్చలు నిర్వహించి ఖాళీల భర్తీకి నిర్ణయం తీసుకున్నారు.

ఉద్యోగాల భర్తీ

పరిశుభ్రమైన, ప్రణాళిక బద్దమైన విధంగా ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలని ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీ తర్వాత ప్రజలకు వేగంగా పౌర సేవలు అందించడంతోపాటు పట్టణ ప్రగతి మరింత వేగవంతం అవుతుందన్నారు. దీంతో పురపాలనలో నూతన మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్ల‌డించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకు ఒక పురపాలక ఉద్యోగిని ఉంచే లక్ష్యంతో వార్డు అధికారుల‌ను నియమిస్తున్నట్లు చెప్పారు. ఇలా అన్ని వార్డుల్లో ఒక అధికారి ఉండడం దేశంలోనే మెదటిసారిని మంత్రి అన్నారు. పురపాలక చట్టం నిర్ధేశించిన పారిశుద్ధ్యం, హారిత హారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పురసేవల అమలు మెదలైన కార్యక్రమాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ఈ వార్డు అధికారుల నియామకం దోహాదం చేస్తుందన్నారు.

ప్రజలకు పురపాలక శాఖకు

ఖాళీల భర్తీ తర్వాత ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు, పురపాలక శాఖ నూతన చట్టం ప్రకారం స్పూర్తితో ముందుకు పోయేందుకు వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వార్డు ఆఫీసర్ల నియామకం ద్వారా ప్రజలకు పురపాలక శాఖకు అవసరమైన వారధి ఏర్పడుతుందన్నారు. తద్వారా పురపాలన అంటే పౌర పాలన అనే స్పూర్తి నిజం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పురపాలకశాఖ ఇంజినీరింగ్ పనుల్లో ప్రస్తుతం జరుగుతున్న అసాధారణ జాప్యం అరికట్టేందుకు ఇద్దరు ఛీఫ్​ ఇంజినీర్లను ఉంచేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. వారికి సహాయంగా ఇద్దరు లేదా ముగ్గురు ఏస్.ఈలు కూడా ఉండే విధంగా ఆమోదం తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన ఖాళీలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వీటి భర్తీ అత్యంత పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి : యూజీసీ నెట్​ పరీక్షల షెడ్యూల్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.