ETV Bharat / state

మల్లన్న వాగుకు వరద ఉద్ధృతి... రాకపోకలకు గిరిజనుల అవస్థలు

author img

By

Published : Oct 14, 2020, 10:20 PM IST

mallanna sagar bridge problems
mallanna sagar bridge problems

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మల్లన్న వాగు దాటడం గిరిజనుల పాలిట ప్రమాదకరంగా మారింది. రెండురోజులుగా కురిసిన వర్షానికి మల్లన్న వాగుకు వరద ఉద్ధృతి పెరుగుతుండడం వల్ల వాగుపై ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. పలుగ్రామాలకు రాకపోకలు మళ్లీ నిలిచిపోయాయి.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు వరదలు ఉప్పొంగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని మల్లన్న వాగుకు వరద ఉద్ధృతి పెరగింది. వాగు దాటి మండల కేంద్రానికి వచ్చేందుకు గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. నర్సాపురం తండాకు చెందిన భిక్షమయ్య తన చంటి బిడ్డకు టీకా నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లేందుకు అతికష్టం మీద వాగు దాటాడు. ఆరోగ్య కేంద్రంలో టీకా వేయించి తిరిగి మళ్లీ వాగు దాటి స్వగ్రామం నర్సాపురానికి చేరుకున్నాడు.

టీకా కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చంటిబిడ్డను పట్టుకుని వాగు దాటాల్సి వచ్చిందని... పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే ఆ పసిప్రాణం పరిస్థితి ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా మల్లన్నవాగుపై పనుల్లో వేగం పెంచి వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు... జనజీవనం అస్తవ్యస్థం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.