ETV Bharat / state

'ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి ముప్పు'.. పోలవరం అథారిటీకి తెలంగాణ లేఖ

author img

By

Published : Jul 30, 2022, 7:22 PM IST

Updated : Jul 30, 2022, 9:29 PM IST

Polavaram
Polavaram

19:19 July 30

Telangana ENC letter on Polavaram: పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్‌సీ

Telangana ENC letter on Polavaram:పోలవరం ప్రాజెక్టు పూర్తయితే భద్రాచలానికి బ్యాక్‌వాటర్‌ ముప్పు ఉందని తెలంగాణ ఈఎన్​సీ తెలిపింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీకి లేఖ రాసింది. బ్యాక్‌వాటర్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని కోరింది. బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించాలని ఈఎన్‌సీ లేఖలో పేర్కొంది.

ఎఫ్ఆర్ఎల్ వద్ద నీటినిల్వ ఉంటే ముంపు ఎక్కువ ఉంటుందని లేఖలో వివరించింది. ముర్రేడువాగు, కిన్నెరసాని నదుల పరిసరాలు మునుగుతాయని ఈఎన్‌సీ తెలిపింది. రక్షణ కట్టడాలు నిర్మించి నివారణ చర్యలు చేపట్టాలని లేఖలో కోరింది. బ్యాక్‌వాటర్‌తో ఏర్పడే ముంపును నివారించాలని తెలంగాణ ఈఎన్‌సీ విజ్ఞప్తి చేసింది. నష్ట నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా వివరించింది.

ఆ రికార్డులు ఇవ్వండి: కేఆర్​ఎంబీకి మరో లేఖ

కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్ సమాచారం ఇవ్వాలని కోరింది. పాత రికార్డులు లేకుండా అంశాలను అర్థం చేసుకోలేమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. రూల్ కర్వ్స్ తయారీ, సాంకేతిక అంశాలు అర్థం చేసుకోవాల్సి ఉందని లేఖలో వెల్లడించింది. అర్థం చేసుకోవడానికి పాత రికార్డులు కావాలని అడిగింది. తామేమీ రహస్య సమాచారం అడగడం లేదని తెలిపింది. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవాల్సిన అవసరముందని లేఖలో పేర్కొంది. వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలని ఈఎన్‌సీ లేఖలో విజ్ఞప్తి చేసింది. రూల్ కర్వ్స్ ముసాయిదాపై అభిప్రాయాలు చెబుతామని ఈఎన్‌సీ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: వాళ్లు వద్దనుకుంటుంటే.. వీళ్లు మాత్రం కోరుకుంటున్నారు: బండి సంజయ్

'మతం పేరుతో హింస.. దేశ పురోగతిని దెబ్బతీసే యత్నం'

Last Updated :Jul 30, 2022, 9:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.