ETV Bharat / state

గంజాయి స్మగ్లింగ్ ఒడిశా టు మహారాష్ట్ర వయా తెలంగాణ

author img

By

Published : Feb 17, 2023, 7:39 PM IST

Police seized 284 kg of ganja in Nalgonda district
నల్గొండ జిల్లాలో 284కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

Telangana police arrested ganja smugglers: రాష్ట్రంలో పలు చోట్ల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి అధిక మొత్తంలో గంజాయి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Police arrested who were illegally transporting marijuana: సులభంగా తక్కువ కాలంలో అధిక మొత్తంలో నగదు సంపాదించాలని దురుద్దేశంతో చాలామంది యువకులు అక్రమ గంజాయి రవాణాకు అలవాటు పడుతున్నారు. ఇలా చేయడం వలన పోలీసులకు గంజాయితో దొరికి.. వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో కొంత మందిని గంజాయి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా మహారాష్ట్రకు కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడని అధికారులు తెలుసుకున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం చెక్​పోస్ట్ దగ్గర పోలీసులు, ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు నిఘా ఉంచారు. ఆ సమయంలో అక్కడకి వచ్చిన నిందితుడ్ని పట్టుకున్నారు. స్మగ్లర్ నుంచి 180 కేజీల గంజాయి, కారుని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో మూడు లక్షలకు కొనుగోలు చేసి మహారాష్ట్రలో రూ.36 లక్షలకు అమ్ముకునేందుకు వెళుతున్న క్రమంలో పట్టుకున్నారు. నిందితుడిని కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Police seized 284 kg of ganja in Nalgonda district
నల్గొండ జిల్లాలో 284కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

284కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు: నల్గొండ జిల్లాలో కూడా ఇలానే మరో వ్యక్తి పోలీసులకు చిక్కాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన శక్తితని గైరాజు(43) మాచర్ల నుంచి హైదరాబాద్​కు అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా.. పోలీసులు పెద్దపూర సమీపంలో పట్టుకున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి రూ.55లక్షలు విలువ చేసే 284 కేజీల గంజాయి, ఒక కారు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మేడ్చల్ జిల్లాలో మరో నలుగురు: మేడ్చల్ జిల్లా మేడిపల్లి ప్రాంతానికి చెందిన అవినాష్ , నిషాల్, రఘు, సతీష్ యువకులు గంజాయికి అలవాటు పడ్డారు. ఉప్పల్ నల్లచెరువు సమీపంలో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో నలుగురిపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి రూ.3లక్షల 38వేలు విలువ చేసే గంజాయితో పాటు.. రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు చరవాణిలు స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ జానకి చెప్పారు.

Police seized cannabis worth more than 3 lakhs in Medchal
మేడ్చల్ జిల్లాలో 3లక్షలు పైనే విలువ చేసే గంజాయిని పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్​లో ఇంకో ముగ్గురు: ఒడిశా నుంచి హైదారాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్​లోని మథురకు ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కొండాపూర్​లో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో ఉత్రరప్రదేశ్​కు చెందిన సౌరవ్ సింగ్, జై ప్రకాష్ సింగ్, రాధా అనే ముగ్గురు నిందితులపై అనుమానం రావడంతో వారిని పట్టుకున్నారు. ఆరా తీస్తే కారు వెనుక సీటులో గంజాయి పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారని తేలింది. నిందితుల దగ్గర ఉన్న 23 కేజీల గంజాయి, ఒక కారు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.

Police seized 23 kg of ganja in Hyderabad
హైదరాబాద్​లో 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.