ETV Bharat / state

భౌతిక దూరాన్ని విస్మరించి.. బ్యాంకుల వద్ద క్యూ లైన్లో జనం

author img

By

Published : May 6, 2020, 6:38 PM IST

ప్రభుత్వం లాక్​డౌన్​ సాయంగా ఇస్తున్న రూ.1500 కోసం జనాలు బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. డబ్బుల కోసం భౌతిక దూరం పాటించకుండా బ్యాంకుల్లో నిరీక్షిస్తున్నారు.

People Not Following  Physical Distance In Illandu Andhra Bank
భౌతిక దూరాన్ని విస్మరించి.. బ్యాంకుల వద్ద క్యూ లైన్లో జనం

లాక్​డౌన్​ సమయంలో పేదలకు, తెల్ల రేషన్​కార్డు ఉన్నవారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1500 కోసం ఖాతాదారులు బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. డబ్బులు తీసుకోవాలన్న ఆతృతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ ప్రజలు భౌతిక దూరం పాటించకుండా పట్టణంలోని ఆంధ్రా బ్యాంకు ముందు క్యూ కడుతున్నారు. బ్యాంకు సిబ్బంది పదే పదే వారిస్తున్నా.. పట్టించుకోకుండా, భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరుు తోసుకుంటూ డబ్బుల కోసం ఎగబడుతున్నారు.

ఇదీచూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.