ETV Bharat / state

300 మంది భక్తులు 300 కి.మీ... రథాన్ని నడుపుకుంటూ రామయ్య చెంతకు..

author img

By

Published : Feb 13, 2023, 3:54 PM IST

bcm
bcm

Padayatra Of Kakinada Devotees To Bhadradri: దక్షిణాది అయోధ్య భద్రాద్రి రామయ్య సన్నిధికి 300 మంది భక్తులు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రఘురాముని చెంతకు చేరుకున్నారు. ఏపీలోని కాకినాడకు చెందిన ఈ భక్తులు 11 లక్షల విలువ చేసే సీతారాముల రథాన్ని తయారుచేసి తొమ్మిది రోజుల పాటు ఇలా పాదయాత్రతో వచ్చి రాములోరిని దర్శించుకున్నారు.

Padayatra Of Kakinada Devotees To Bhadradri: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య సన్నిధికి ఏపీలోని కాకినాడకు చెందిన 300 మంది రామ భక్తులు తొమ్మిది రోజులపాటు 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇవాళ భద్రాచలం చేరుకున్నారు. వాసుదేవ గురుస్వామి ఆధ్వర్యంలో 2012 నుంచి ప్రతి ఏటా పాదయాత్ర చేసి భద్రాద్రి రామయ్య దర్శనం కోసం వస్తున్నట్లు భక్తులు తెలిపారు.

ఈ ఏడాది రూ.11 లక్షల విలువ చేసే సీతారాముల శ్రీరామ రథాన్ని తయారు చేయించి రథంతో పాటు పాదయాత్ర చేసుకుంటూ రాములోరి దగ్గరకు చేరుకున్నారు. ఈనెల 4వ తేదీన బయళ్దేరిన ఈ బృందం ఈరోజు భద్రాచలం చేరుకుంది. శ్రీరామ నామాన్ని అందరికి తెలియజేయాలని ప్రధాన ఉద్యేశ్యంతో లోక కల్యాణార్థం ఈ పాదయాత్ర చేపట్టినట్లు గురుస్వామి వాసుదేవ పేర్కొన్నారు.

"మాది కాకినాడ జిల్లా అచ్చిపేట గ్రామం. సుమారు 25 గ్రామల నుంచి 300 మంది భక్తులు పాదయాత్ర చేసుకుంటూ భద్రాద్రి రామయ్య గుడికి వచ్చాం. 2012లో మొదటి సారి ఈ యాత్ర చేశాం. అప్పుడు ఇద్దరు భక్తులతో మొదలైన మా యాత్ర ఇప్పుడు 300 మంది భక్తులకు చేరుకుంది. ఈ యాత్ర లోక కల్యాణార్థం ఇలా ప్రతి సంవత్సరం చేస్తున్నాం. శ్రీ రామ అనే తారక మంత్రం జపిస్తే మన కష్టాలు పోతాయి. మనకు ఆరోగ్యం లభిస్తుంది. పాడి పంటలు బాగా పండుతాయి. రామ మంత్రం జపిస్తే మనకు ఉన్న అనారోగ్య సమస్యలు పోయి ఆరోగ్యం సిద్ధిస్తోందని నమ్మకంతో రామ మంత్రం జపిస్తూ ఈ పాదయాత్ర చేశాం."- వాసుదేవ గురుస్వామి, కాకినాడ

Sitaram marriage festival in Bhadradri: మరోవైపు రాములోరి భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లోక కల్యాణానికి తేదీ వచ్చేసింది. భద్రాద్రి సీతారాముల వారి కల్యాణానికి ముహూర్తం ఖారారు అయింది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ కల్యాణం జరుగుతోంది. ఈ సంవత్సరం సీతారాముల కల్యాణం మార్చి 30వ తేదీన నిర్వహిస్తున్నట్లు వైదిక కమిటీ నిశ్చయించారు. అదే విధంగా మార్చి 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తామని కమిటీ తెలిపింది. ఇందుకోసం ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా ఈ ఏడాది జరిగే పట్టాభిషేకానికి ప్రత్యేకత ఉందని కమిటీ సభ్యులు చెప్పారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పట్టాభిషేకమని తెలిపారు.

300 మంది భక్తులు 300 కి.మీ... రథాన్ని నడుపుకుంటూ రామయ్య చెంతకు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.