ETV Bharat / state

Koram Kanakaiah Join Congress : బీఆర్​ఎస్​కు బైబై.. కాంగ్రెస్​ గూటికి​ భద్రాద్రి జడ్పీ ఛైర్మన్​ కనకయ్య

author img

By

Published : Jul 1, 2023, 3:48 PM IST

BRS leader Koram Kanakaiah will join Congress : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య.. బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగే కాంగ్రెస్​ సభలో పొంగులేటితో కలసి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్నారు. అతనితో పాటు ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్​లో చేరనున్నారు.

kanakayya
kanakayya

Bhadradri Kothagudam ZP chairman Kanakaiah resigned : పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య అనుచరులతో కలసి జులై 2న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సమక్షంలో.. ఖమ్మంలోని జరిగే కాంగ్రెస్​ బహిరంగ సభలో భద్రాద్రి జెడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈమేరకు ఆయన బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన.. అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. ఇల్లందు జెడ్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. బీఆర్​ఎస్​, కేసీఆర్​లపై విమర్శలు చేశారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వర్గంలో ముఖ్య నాయకుడిగా ఉన్న భద్రాద్రి జెడ్పీ ఛైర్మన్​ కోరం కనకయ్య బీఆర్​ఎస్​ పార్టీకి రాజీనామా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఎందరో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో.. అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ పార్టీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా న్యాయం చేయలేకపోయిందని కనకయ్య అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీలోకి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి.. ఒక జెడ్పీటీసీ, 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు, ఒక ఇల్లందు మున్సిపల్​ కౌన్సిలర్​, పీఎసీఎస్​ ఛైర్మన్​, పలువురు నాయకులు, కార్యకర్తలు చేరనున్నారని వెల్లడించారు.

"ఇల్లందు నియోజవర్గంలోని ఐదు మండలాల సర్పంచ్​లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు బీఆర్​ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరనున్నాము. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్​ సభలో అందరం కలసి కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకోనున్నాము. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో తెలంగాణను సంపాదించుకున్నాం. కానీ బీఆర్​ఎస్​ ఆ కలను సాకారం చేయలేకపోయింది." -కోరం కనకయ్య, భద్రాద్రి జెడ్పీ ఛైర్మన్​

ZP chairman Kanakaiah Comments On BRS : ఇల్లందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మున్సిపల్ ఛైర్​పర్సన్​ అనసూర్య సైతం పాల్గొన్నారు. జులై 2న ఖమ్మంలో జరిగే కాంగ్రెస్​ పార్టీ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డితో కలసి కాంగ్రెస్​ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు ఇల్లందు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వేలాది మంది ప్రజలు హాజరవుతారని స్పష్టం చేశారు.

పదవి రాజీనామా చేయాలని బీఆర్​ఎస్​ డిమాండ్​ : జడ్పీ ఛైర్మన్​ పదవిలో ఉంటూ బీఆర్​ఎస్​ పార్టీలో కొనసాగుతూ వస్తున్న కనకయ్య.. పొంగులేటి చేస్తున్న ప్రయాణంలో పాల్గొంటూ వచ్చారు. దీనితో ఆయనకు బీఆర్​ఎస్​ పార్టీ నుంచి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అందుకు సమాధానంగా కనకయ్య.. తనను రాజీనామా చేయమని చెప్పడం కాదు అవిశ్వాస తీర్మానం పట్టండి అని బదులు ఇస్తూ సవాల్​ విసిరేవారు.

బీఆర్​ఎస్​ పార్టీకి భద్రాద్రి జడ్పీ ఛైర్మన్​ కనకయ్య.. బైబై

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.