ETV Bharat / state

వాగులో గల్లంతైనా... క్షేమంగా బయటికొచ్చాడు...

author img

By

Published : Sep 26, 2020, 11:28 AM IST

ఎడతెరపిలేకుండా కురిసిన వర్షానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గొందిగూడెం ఇసుకవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ద్విచక్రవాహనంతో వాగు దాటబోయిన ఓ వ్యక్తి వరద ప్రవాహానికి గల్లంతయ్యాడు. తీవ్రంగా శ్రమించి... బతుకుజీవుడా అంటూ క్షేమంగా బయటికివచ్చాడు.

a man safely reached to home after drown in river at bhadradri kothagudem
a man safely reached to home after drown in river at bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగులో ఓ వ్యక్తి గల్లంతై... క్షేమంగా బయటపడ్డాడు. గొందిగూడెం గ్రామానికి చెందిన నరసింహారావు... శుక్రవారం అశ్వాపురం మండల కేంద్రానికి వెళ్లి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న క్రమంలో ఇసుకవాగుపై నుంచి వెళ్లాడు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇసుక వాదు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

వాగు ప్రవాహనానికి ద్విచక్రవాహనంతో పాటు నరసింహారావు సైతం నీటిలో కొట్టుకుపోయాడు. నరసింహారావుకి ఈత రావటం వల్ల తీవ్రంగా శ్రమించి అతికష్టంపై... క్షేమంగా ఒడ్డుకు చేరుకుని ఇంటికి వెళ్ళాడు. శనివారం ఉదయం వాగులో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాన్ని గుర్తించి స్థానికుల సాయంతో బయటకు తీశారు.

ఇదీ చూడండి: కీకారణ్యంలో ఆధిపత్య పోరు... పోలీసులదే పైచేయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.