ETV Bharat / state

రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

author img

By

Published : Feb 26, 2020, 9:12 AM IST

Updated : Feb 26, 2020, 11:13 AM IST

tiger-wandering
రహదారిపై రారాజుల సంచరిస్తూ... భయం పుట్టిస్తున్న పెద్దపులి

జైనథ్​ మండలంలోని నీరాలలో పెద్దపులి సంచరిస్తూ గ్రామస్థులను భయాందోళనలకు గురిచేస్తోంది. నీరాల శివారులోని ప్రధాన రహదారిపై పెద్దపులి సంచరిస్తుండగా ఓ వ్యక్తి సెల్​ఫోన్​లో చిత్రీకరించాడు.

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం నీరాలలో పెద్దపులి సంచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నీరాల శివారులోని బేల-ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి సంచరిస్తుండగా కారులో ప్రయాణిస్తున్న బేలవాసి గుర్తించాడు. కారును నిలిపివేసి పులిని సెల్​ఫోన్​లో చిత్రీకరించాడు.

లక్ష్మీపూర్​ కెనాల్​లో నీళ్లు తాగడానికి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

రహదారిపై రారాజులా సంచరిస్తూ.. భయం పుట్టిస్తున్న పెద్దపులి

ఇవీ చూడండి: 'ఆరు నెలల్లోపు పట్టణ ప్రగతి కనిపించాలి'

Last Updated :Feb 26, 2020, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.