ETV Bharat / state

Rekhanayak joing Congress : కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్

author img

By

Published : Aug 21, 2023, 10:25 PM IST

Updated : Aug 21, 2023, 10:52 PM IST

Rekhanayak joined Congress
Rekhanayak joined Congress

22:17 August 21

Rekhanayak joing Congress : రేపు కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్

MLA Rekhanayak Join Congress Tomorrow : బీఆర్​ఎస్​ ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖ నాయక్‌ భర్త శ్యామ్‌ నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో ఆయన్ను కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. పార్టీ కండువా కప్పి శ్యామ్​ నాయక్​ను పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్​ఎస్​ అభ్యర్ధుల జాబితాలో రేఖనాయక్‌కు చోటు దక్కలేదు. రేఖనాయక్‌ స్థానంలో భూక్య జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌కు చోటు కల్పించారు. సీటు కోల్పవడంతో రేఖా నాయక్‌ భర్త శ్యామ్‌ నాయక్‌ సాయంత్రానికే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. రేపు రేఖానాయక్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది.

BRS Candidates List 2023 : తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల యుద్ధానికి సమరం శంఖం పూరించిన ప్రభుత్వాధినేత కేసీఆర్.. తమ పార్టీ తరపున బరిలో నిలవబోయే గెలుపు గుర్రాల మొదటి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే ఏకంగా 115 మంది అభ్యర్థులకు (BRS MLA Candidates List 2023) టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ జాబితా ప్రకటనతో.. రాష్ట్రంలో ఎలక్షన్ సైరన్ మోగినట్టైంది. ఈ దఫా.. సిట్టింగుల్లో చాలా మందికి చోటు దక్కదనే ప్రచారం జరిగింది. దాదాపు 30 మంది వరకూ ఇంటికి వెళ్తారనే చర్చ జోరుగా సాగింది. కానీ.. అంచనాలను తారు మారు చేస్తూ.. స్వల్ప మార్పులు మాత్రమే చేపట్టారు కేసీఆర్. కేవలం 7 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తున్నట్టు ప్రకటించారు.

ఉమ్మడి అదిలాబాద్​లో బీఆర్​ఎస్​ అభ్యర్థులు వీరే:

సిర్పూర్ - కోనేరు కోనప్ప

చెన్నూరు - బాల్క సుమన్

బెల్లంపల్లి - దుర్గం చెన్నయ్య

మంచిర్యాల- దివాకర్ రావు

అదిలాబాద్ - జోగు రామన్న

బోథ్ - అనిల్ జాదవ్

నిర్మల్ - ఆల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ముథోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి

ఆసిఫాబాద్- కోవా లక్ష్మి

ఖానాపూర్-జాన్సన్ నాయక్

చోటు కోల్పోయిన సిట్టింగ్​లు వీరే..

సుభాష్ రెడ్డి - ఉప్పల్

రాజయ్య - స్టేషన్ ఘన్​పూర్

రాములు నాయక్ - వైరా

రేఖా నాయక్ -ఖానాపూర్

చెన్నమనేని రమేష్ - వేములవాడ

గంప గోవర్ధన్ -కామారెడ్డి

రాథోడ్ బాపురావు -బోధ్

విద్యాసాగర్ రావు - కోరుట్ల (ఆయన కుమారుడు సంజయ్​కు ఇచ్చారు)

ఆత్రం సక్కు - ఆసిఫాబాద్‌

BRS MLAs Final Candidates List 2023 : బీఆర్​ఎస్​ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!

CM KCR Contests from Two Seats : ఈసారి గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ

Political Analysis on Reasons not Giving MLA Ticket to Rajaiah : రాజయ్యకు టికెట్ రాకపోవడానికి గల కారణాలు ఇవేనా?

Last Updated : Aug 21, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.