ETV Bharat / state

అంతరాష్ట్ర చెక్​పోస్టు వద్ద నిషేధిత గుట్కా స్వాధీనం

author img

By

Published : May 24, 2020, 7:44 PM IST

మహారాష్ట్ర నుంచి నిషేధిత గుట్కా సరఫరా అవుతుందన్న సమాచారంతో ఆదిలాబాద్​ జిల్లా ఘన్​పూర్​ అంతరాష్ట్ర చెక్​పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.2.76 లక్షల విలువైన గుట్కా లభ్యమైంది.

prohibited gutka caught in adilabad inters state check post
అంతరాష్ట్ర చెక్​పోస్టు వద్ద నిషేధిత గుట్కా స్వాధీనం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఘన్​పూర్ అంతరాష్ట్ర చెక్​పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.2.76 లక్షల విలువైన నిషేధిత పొగాకును పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర హిమాయత్​నగర్ నుంచి యథేచ్ఛగా నిషేధిత తంబాకు, గుట్కా సరఫరా చేస్తున్నారన్న అనుమానంతో చెక్​పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు.

సోదాల్లో భాగంగా ఓ వాహనంలో ప్యాలాల సంచుల మాటున నిషేధిత గుట్కా లభ్యమైంది. గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత కథనం: గొర్రెకుంట బావిలో మృతదేహాలపై వీడుతున్న మిస్టరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.