ETV Bharat / state

రూ. కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం.. పట్టించుకోని బల్దియా యంత్రాంగం

author img

By

Published : Mar 29, 2023, 11:47 AM IST

Updated : Mar 29, 2023, 11:56 AM IST

Govt Land Kabza Issue in Adilabad : పేదలు... సెంటుభూమిలో గుడిసెవేసుకుంటే... ఆగమేఘాలమీద వచ్చి తొలగించే అధికార యంత్రాంగం... స్థిరాస్తి వ్యాపారులు కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే పట్టించుకోవడం లేదు. పక్కా మున్సిపాల్టీ భూమి అని తెలిసి కూడా పరిగణలోకి తీసుకోవడంలేదు. ఆదిలాబాద్‌ బల్దియా అధికారులు కళ్లుమూసుకున్న వ్యవహారంపై 'ఈటీవీ-భారత్' పరిశోధనాత్మక కథనం.

Govt Land Kabza
Govt Land Kabza

రూ. కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం.. పట్టించుకోని బల్ధియా యంత్రాంగం

Govt Land Kabza Issue in Adilabad : ఆదిలాబాద్‌ పట్టణాన్ని ఆనుకొని 241 సర్వేనంబర్‌లో... 2005లో ఏర్పడిన జీఎస్‌ ఎస్టేట్‌ లేఅవుట్‌ పరిధిలోకి వచ్చే 5 ఎకరాల మున్సిపాల్టీ స్థలమిది. గృహ, వాణిజ్య అవసరాలకు పోగా మిగిలిన స్థలాన్ని... రోడ్లు వేయడానికి పురపాలక సంఘం పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. 5 ఎకరాలతో 200 అడుగుల రింగు రోడ్డు, దానికి ఇరువైపుల 40 అడుగుల చొప్పున.. సర్వీసు రోడ్డు వేయాలి. ఈ మేరకు జీఎస్‌ ఎస్టేట్‌ నిర్వహకులు బల్దియాకు గిప్టు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుత ధర ఎకరాకు కోటి రూపాయల చొప్పున పలుకుతోంది. 5 కోట్ల విలువైన ఐదు ఎకరాల స్థలాన్ని కొట్టేసేందుకు పన్నాగం పన్నారు.

అప్పుల ఊబిలో చిక్కుకున్న లేఅవుట్‌ నిర్వహకులు... రింగ్‌ రోడ్డు కోసం కేటాయించిన 5 ఎకరాలను తమకు తిరిగి ఇచ్చేయాలని కోరుతూ 2009 నుంచి పలుమార్లు అధికారులను ఆశ్రయించినప్పటికీ.. మున్సిపల్‌ కౌన్సిల్‌ అంగీకరించలేదు. ఆ తరువాత అప్పటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం సైతం ఫలించలేదు. అప్పట్లో పురపాలక అధికారులు కుదరదు అనడంతో కుట్రకు తెరలేపారు. కొంతమంది స్థిరాస్తి వ్యాపారులతో కలిసి 2015లో తమపేరిట రిజిస్ర్టేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఇతరుల పేరిట మార్చగా... వారిలో ఒకరిద్దరు 35.20 లక్షలకు ఓ ప్లాటు... 52.60 లక్షలకు మరో ప్లాట్‌లను ఇటీవల విక్రయించారు. దీంతో అక్రమ దందా బయటపడింది.

'మున్సిపాలిటీ ఆస్తి ఇది. 280ఫీట్లు.. దాదాపు ఐదు ఎకరాలు ఉంటుంది. దానిని వీళ్లు అమ్ముతున్నారంటే ఇంత పెద్ద ఆదిలాబాద్ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్స్​లో హైవే పక్కకు ఉన్న కోట్ల రూపాయల విలువ చేసే మున్సిపాలిటీ భూమిని అమ్ముతుంటే అధికారులు కాపాడలేకపోతున్నారంటే పరిస్థితి గోరంగా ఉన్నది.'-ప్రకాశ్‌, స్థానికుడు, జీఎస్‌ఎస్టేట్‌

'రియల్ ఎస్టేట్​ వాళ్లు అంత సమంగా చేశారు. అక్కడ రోడ్లు అయితే ఏమి కనిపిస్తలేవు. అది రియల్ ఎస్టేట్ వాళ్లకు మున్సిపాలిటీ వాళ్లు అమ్మేశారా ? ప్రభుత్వం, అధికారులు ఏం చేస్తున్నారు ? దీనిపై అధికారులు తక్షణమే విచారణ చేయాలి. రోడ్లు అనేవి శాశ్వతంగా ఉండేవి. మాకు వచ్చేటందుకు పోయేటందుకు దారులు.. ఓపెన్ స్థలం ఎక్కడ మిగలదు. కనుక దీనిపై కచ్చితంగా విచారణ జరిపించాలి.'- ముకేష్‌సింగ్‌ ఠాకూర్‌, జీఎస్‌ఎస్టేట్‌

మున్సిపాల్టీకి చెందిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం వెనక కొంతమంది అధికారుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంటే... విచారణ జరిపిస్తామనే మాట మున్సిపల్‌ కమిషనర్‌ రావడం ప్రాధాన్యతాంశంగా కనిపిస్తోంది. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించుకున్న ఈ భూమి... 44 నెంబర్‌గా జాతీయ రహదారి పక్కనే ఉంది. ఈ రహదారి.. ఆదిలాబాద్‌ అవతల నుంచి బైపాస్‌గా వెళ్తోంది. దీన్ని ఆసరా చేసుకున్న అక్రమార్కులు భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 29, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.