ETV Bharat / sports

Tokyo Olympics: రెజ్లర్లకు నిరాశ.. వినేశ్, అన్షు మాలిక్ ఓటమి

author img

By

Published : Aug 5, 2021, 10:19 AM IST

Updated : Aug 5, 2021, 10:28 AM IST

tokyo olympics
వినేశ్​ పొగాట్

టోక్యో ఒలింపిక్స్​ క్వార్టర్​ ఫైనల్లో ఓటమి చవిచూసింది స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్. అయితే అప్పుడే ఆమె పోరు ముగిసిపోలేదు. కాంస్యం కోసం పోరాడేందుకు ఆమెకు మరో అవకాశం లభించే వీలుంది. అలాగే మరో రెజ్లర్ అన్షు మాలిక్ కూడా పరాజయం చెందింది.

భారత స్టార్​ రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది. అయినప్పటికీ టోక్యోలో ఆమెకు మరో అవకాశం ఉంది. ఒకవేళ వనేసా ఫైనల్ చేరితే వినేశ్​కు రెపిచేజ్ రౌండ్​లో పోటీపడే వీలుంటుంది.

ముగిసిన అన్షు పోరు..

tokyo olympics
అన్షు మాలిక్

మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్​ రెజ్లింగ్​ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్​ రౌండ్​లో ఓటమి పాలైంది. రష్యన్ ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారిణి వలెరియా కొబ్లోవా చేతిలో పరాజయం చెందింది. దీంతో పతకం సాధించకుండానే విశ్వక్రీడల నుంచి వెనుదిరిగింది.

ఇదీ చూడండి: తీరిన 41 ఏళ్ల కల.. టోక్యో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టుకు కాంస్యం

Last Updated :Aug 5, 2021, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.