ETV Bharat / sports

సింధుకు ఒలింపిక్ పతకం.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రశంసలు

author img

By

Published : Aug 1, 2021, 6:44 PM IST

pv sindhu victory, prime minister modi wishes
సింధు మోదీ

ఒలింపిక్స్​లో వరుసగా రెండుసార్లు పతకాలు గెలుచుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ఆమె విజయంపై ట్వీట్లు చేసి, మెచ్చుకున్నారు.

"టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం గెలుచుకున్న పీవీ సింధును ప్రధాని మోదీ ప్రశంసించారు. పతక ప్రదర్శనపై ఆనందంగా ఉన్నామని ట్వీట్ చేశారు. భారత్​కు ఆమె గర్వకారణమని, దేశ అత్యుత్తమ ఒలింపియన్లలో సింధు ఒకరని రాసుకొచ్చారు.

"పీవీ సింధు.. రెండు ఒలింపిక్స్​లో వరుసగా పతకాలు సాధించిన తొలి మహిళ. స్థిరత్వం, అంకిత భావంలో ఆమె కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. భారతదేశానికి కీర్తి తీసుకొచ్చిన ఆమెకు నా హృదయపూర్వక అభినందనలు" అని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

  • P V Sindhu becomes the first Indian woman to win medals in two Olympic games. She has set a new yardstick of consistency, dedication and excellence. My heartiest congratulations to her for bringing glory to India.

    — President of India (@rashtrapatibhvn) August 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారతదేశం గర్వించేలా సింధు విజయం సాధించిందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకుర్ అన్నారు. రెండు పతకాలు సాధించిన రెండో అథ్లెట్​ ఆమె అని చెప్పారు. మీరాబాయ్, సింధు పతకాలు గెల్చుకున్నారు. బాక్సర్​ లవ్లీనా కూడా పతకం గెలుస్తుందని ఆశిస్తున్నట్లు అనురాగ్ తెలిపారు.

ఇది చదవండి: ఒలింపిక్స్​లో పీవీ సింధుకు కాంస్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.