ETV Bharat / sports

Manika Batra: కోచ్​పై మనికాబాత్రా సంచలన​ ఆరోపణలు

author img

By

Published : Sep 3, 2021, 8:53 PM IST

Updated : Sep 3, 2021, 9:25 PM IST

Manika alleges national coach Roy asked her to fix match in Olympic qualifiers
టేబుల్​ టెన్నిస్​ కోచ్​పై మనికాబాత్రా ఫిక్సింగ్​ ఆరోపణలు

టేబుల్​ టెన్నిస్​ జాతీయ కోచ్​ సౌమ్యదీప్​ రాయ్​.. తనను మ్యాచ్​ ఫిక్సింగ్​కు చేయమని చెప్పినట్లు మనితా బాత్రా ఆరోపించింది. కానీ తను అలా చేయలేదని తెలిపింది.

ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​లో జాతీయ కోచ్​ సౌమ్యదీప్​ రాయ్​.. తనను మ్యాచ్​ ఫిక్సింగ్​ చేయమన్నారని టేబుల్​ టెన్నిస్​ ప్లేయర్ మనికా బాత్రా పేర్కొంది. అయితే దానికి తాను అంగీకరించలేదని తెలిపింది. అందువల్లే టోక్యో ఒలింపిక్స్​లో ఆయన సహాయం తీసుకోలేదని టేబుల్​ టెన్నిస్​ సమాఖ్య కార్యదర్శి అరుణ్​ బెనర్జీకి ఆమె చెప్పింది.

"ఒలింపిక్స్​లో జాతీయ కోచ్​ సహాయం లేకుండా ప్రదర్శన చేయడం పట్ల చాలా పెద్ద కారణమే ఉంది. ఈ ఏడాది మార్చిలో దోహా వేదికగా జరిగిన ఒలింపిక్స్​ క్వాలిఫయర్స్​లో ఆయన స్టూడెంట్ అర్హత సాధించేందుకు నాతో మ్యాచ్​ ఫిక్సింగ్​ చేయించాలని చూశాడు"

- మనికా బాత్రా, టేబుల్​ టెన్నిస్​ క్రీడాకారిణి

"సౌమ్యదీప్​ రాయ్​కు వ్యతిరేకంగా ఆరోపణలున్నాయి. దీనిపై ఆయన స్పందించిన తర్వాత భవిష్యత్​ కార్యచరణను ప్రకటిస్తాం" అని షోకాజ్​ నోటీసులో టీటీఏఫ్​ఐ కార్యదర్శి బెనర్జీ ప్రకటించారు.

కోచ్​ రాయ్​ తనతో మ్యాచ్​ ఫిక్సింగ్​ చేయించేందుకు పాల్పడ్డాడనే దానిపై తన దగ్గర ఆధారాలున్నాయని మనికా బాత్రా స్పష్టం చేసింది. "ఈ ఘటనకు సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. సరైన సమయంలో వాటిని అధికారుల ముందు పెడతాను. మ్యాచ్​ ఫిక్సింగ్​ కోసం నాతో మాట్లాడేందుకు జాతీయ కోచ్​ నా వ్యక్తిగత హోటల్​ గదిలో దాదాపుగా 20 నిమిషాల పాటు మాట్లాడారు. తన విద్యార్థి కోసం కోచ్​ రాయ్​ చేసిన అనైతిక మార్గాలను పాటించకూడదని నేను నిర్ణయించుకున్నాను. కానీ, ఆ సమయంలో అతడు నాపై చేసిన బెదిరింపులు, ఒత్తిడి నా ఆటపై ప్రభావం చూపాయి. అందుకే ఒలింపిక్స్​లో ఆయన​ సహాయం నేను తీసుకోలేదు. ఎందుకంటే మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారిణిగా.. నా దేశానికి అత్యుత్తమ ప్రదర్శన చేయడం నా కర్తవ్యం" అని మనికా వెల్లడించింది.

తాను చేసిన ఆరోపణలపై టీటీఎఫ్​ఐ విచారణ చేపట్టకపోవడంపై మనికా బాత్రా ఆవేదన వ్యక్తం చేసింది. కోచ్​ రాయ్​పై తక్షణ విచారణ ఎందుకు చేపట్టడం లేదని భారత టేబుల్​ టెన్నిస్ సమాఖ్యను ఆమె ప్రశ్నించింది. ​

ఇదీ చూడండి.. భారత్​ ఖాతాలో మరో పతకం- ఆర్చరీలో కాంస్యం

Last Updated :Sep 3, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.