ETV Bharat / sports

పారిస్​ ఒలింపిక్స్​కు సింధు సై

author img

By

Published : Aug 4, 2021, 9:43 AM IST

Updated : Aug 4, 2021, 9:52 AM IST

I will definitely play in Paris Olympics and give it my best, says PV Sindhu
నా కోచ్​లకు ధన్యవాదాలు.. పారిస్​ ఒలింపిక్స్​ లక్ష్యంగా!

బ్యాడ్మింటన్​ కెరీర్​లో తాను కలిసి పని చేసిన కోచ్​లకు ధన్యవాదాలు తెలిపింది టోక్యో ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత, భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు. వారందరి దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్​ను సందర్భానుసారంగా వినియోగించుకుంటూ పతకం సాధించానని మీడియాతో వెల్లడించింది.

టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు మంగళవారం స్వదేశంలో అడుగుపెట్టింది. దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సింధుకు అధికారులు ఘనస్వాగతం పలికారు. భారత్​ చేరుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆమె.. కెరీర్​లో తాను పనిచేసిన కోచ్​లందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసింది.

"2024లో జరగనున్న పారిస్​ ఒలింపిక్స్​లో కచ్చితంగా ఉత్తమంగా రాణిస్తాను. దాని కోసం సన్నద్ధమయ్యేందుకు మనకెంతో సమయం ఉంది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్​లో పతకం సాధించడాన్ని ఆస్వాదిస్తున్నాను. నేను పనిచేసిన ప్రతీ కోచ్​ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ప్రతి కోచ్​కు.. విభిన్న శైలి, విభిన్నమైన టెక్నిక్స్​ ఉంటాయి. వారి నుంచి ఎంతోకొంత నేర్చుకొని.. అవసరమైన సమయంలో వాటిని వినియోగించుకోవాలి. ఈ సందర్భంగా వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా ఆటలోని టెక్నిక్స్​, స్కిల్స్​పై ఎక్కువ దృష్టి సారించేందుకు అవసరమైన సమయం ఉంది."

- పీవీ సింధు, భారత స్టార్​ షట్లర్​

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన సింధు.. రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు అందుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం కైవసం చేసుకుంది.

ఇదీ చూడండి.. Olympics Live:రెజ్లింగ్‌లో క్వార్టర్​ ఫైనల్​ చేరిన దీపక్​

Last Updated :Aug 4, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.