ETV Bharat / sports

కరోనా భయంతో టోర్నీ నుంచి టాప్​ ర్యాంకర్​ ఔట్

author img

By

Published : Jul 30, 2020, 6:08 PM IST

Updated : Jul 30, 2020, 6:14 PM IST

విదేశీ ప్రయాణం కష్టమైన ఈ పరిస్థితుల్లో, తాను యుఎస్​ ఓపెన్​లో పాల్గొనడం లేదని ప్రపంచ నం.1​ యాష్​ బార్టీ వెల్లడించింది. ఆగస్టు 31 నుంచి న్యూయార్క్​లో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

కరోనా భయంతో టోర్నీ నుంచి టాప్​ ర్యాంకర్​ ఔట్
టెన్నిస్ ప్లేయర్ బార్టీ

కరోనా భయంతో​ యుఎస్​ ఓపెన్ టెన్నిస్​ టోర్నీ నుంచి వైదొలగినట్లు ప్రకటించింది ఆస్ట్రేలియా ప్లేయర్, ప్రపంచ నం.1 ర్యాంకర్​​ యాష్​ బార్టీ. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రయాణానికి అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. న్యూయార్క్​ వేదికగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 13 తేదీల మధ్య ఈ టోర్నీ జరగనుంది.

"ఈ ఏడాది వెస్ట్రన్​, సదరన్​ ఓపెన్​లతోపాటు యూఎస్​ ఓపెన్​ వెళ్లట్లేదు. టోర్నీలో ఆడటం ఇష్టమే అయినా ప్రస్తుత పరిస్థితుల్లో పాల్గొనడం లేదు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో నా బృందాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు"
-యాష్​ బార్టీ, ఆస్ట్రేలియా టెన్నిస్​ క్రీడాకారిణి

ఆస్ట్రేలియాలో కరోనావ్యాప్తి దృష్ట్యా అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయడం వల్ల ఈ సమయంలో ప్రయాణం కష్టతరం అవుతుంది. ఒకవేళ టోర్నీలో పాల్గొనాలనుకుంటే ప్రభుత్వం నుంచి బార్టీ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత ప్రయాణికులు రెండు వారాల నిర్భంధాన్ని కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందుకే ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Last Updated :Jul 30, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.