ENG vs BAN T20: బంగ్లా చిత్తు.. ఇంగ్లాండ్ ఖాతాలో రెండో విజయం

author img

By

Published : Oct 27, 2021, 7:07 PM IST

england

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​లో ఇంగ్లాండ్(ENG vs BAN T20) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 125 పరుగులు లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే ఛేదించింది.

టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌(ENG vs BAN t20 match) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేసన్‌ రాయ్ (61; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మలన్‌ (28; 25 బంతుల్లో 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ జోస్ బట్లర్ (18) ఐదో ఓవర్‌లో వెనుదిరిగినా రాయ్‌ దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోయింది. ఇస్లామ్‌ వేసిన 13వ ఓవర్లో రాయ్‌ ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్‌, నసూమ్‌ తలో వికెట్ తీశారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్(BAN vs ENG t20 2021) నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది.ముష్ఫికర్‌ రహీమ్ (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనేవరుస షాకులు తగిలాయి. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లిటన్‌ దాస్ (9), మహమ్మద్‌ నయీమ్‌ (5) విఫలమయ్యారు. మొయిన్‌ అలీ వేసిన మూడో ఓవర్‌ రెండో బంతికి లిటన్ దాస్.. లివింగ్‌ స్టోన్‌కి చిక్కగా,మూడో బంతికి నయీమ్‌.. క్రిస్ వోక్స్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వచ్చిన షకీబ్‌-అల్-హసన్‌ (4) కూడా ఆకట్టుకోలేకపోయాడు. క్రిస్‌ వోక్స్ వేసిన ఆరో ఓవర్లో అదిల్ రషీద్‌కి చిక్కి క్రీజు వీడాడు.దీంతో పవర్‌ ప్లే ముగిసేలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి.. బంగ్లాదేశ్‌ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌, మహమ్మదుల్లా (19) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లివింగ్‌ స్టోన్ వేసిన 11వ ఓవర్లో రహీమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15వ ఓవర్లో మహ్మదుల్లా క్రిస్‌ వోక్స్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మెహెదీ హసన్‌ (11), అఫీఫ్‌ హొస్సేన్‌ (5) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో వచ్చిన నురుల్ హసన్‌ (16), నసూమ్‌ అహ్మద్‌ (19) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ మూడు, మొయిన్ అలీ రెండు, లివింగ్‌ స్టోన్ రెండు‌, క్రిస్‌ వోక్స్‌ ఒక వికెట్ తీశారు.

ఇదీ చదవండి:

IND vs PAK: పాక్​ మాజీ క్రికెటర్-హర్భజన్​ మధ్య మాటల యుద్ధం:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.