ETV Bharat / sports

Sushil Kumar: సుశీల్​ ఆయుధ లైసెన్స్​ రద్దు

author img

By

Published : Jun 1, 2021, 12:45 PM IST

రెజ్లర్​ సాగర్​ హత్య కేసు(Wrestler Sagar Murder)లో దిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్​ సుశీల్​ కుమార్​(Sushil Kumar) ఆయుధ లైసెన్స్​ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Wrestler Sushil Kumar's arms license suspended, says Delhi Police
Sushil Kumar: సుశీల్​ ఆయుధ లైసెన్స్​ రద్దు

దిల్లీలోని ఛత్రసాల్​ స్టేడియంలో రెజ్లర్​ సాగర్​ హత్య కేసు(Wrestler Sagar Murder)లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ప్రముఖ రెజ్లర్​ సుశీల్ ​కుమార్​(Sushil Kumar)​. ఈ కేసులో భాగమైన కారణంగా సుశీల్​కు సంబంధించిన ఆయుధ లైసెన్స్​ను రద్దు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రక్రియను ఆయుధాల లైసెన్స్​ జారీ చేసే విభాగం మొదలుపెట్టినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును దిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. సుశీల్​ పరారీలో ఉన్నప్పుడు అతనికి సహాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సాగర్​ హత్య కేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించగా.. ఇప్పటివరకు వారిలో తొమ్మిది మందిని అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. మిగిలిన నలుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత 18 రోజుల ఏడు రాష్ట్రాలను దాటుకొని.. సిమ్​కార్డులను తరచుగా మార్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఒక్కొక్కటిగా బయటకు వస్తోన్న సుశీల్ నేరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.