ETV Bharat / sports

సెంచరీ కొట్టిన సెంటర్‌ కోర్టు.. వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణ

author img

By

Published : Jul 4, 2022, 7:37 AM IST

Wimbledon Court: టెన్నిస్‌ నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల్లో వింబుల్డన్‌ ఎంతో ప్రత్యేకం. ఆల్‌ ఇంగ్లాండ్​ క్లబ్‌లో ఉన్న సెంటర్‌ కోర్టుకు మరింత ప్రాముఖ్యం ఉంది. 1922, జులై 3న ప్రారంభమైన ఈ సెంటర్‌ కోర్టు ఆదివారం శతవసంతాలు పూర్తి చేసుకుంది. సాధారణంగా 14 రోజులు జరిగే వింబుల్డన్‌లో తొలి ఆదివారం విశ్రాంతి. కానీ సెంటర్‌ కోర్టు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కూడా పోటీలు నిర్వహించడం విశేషం.

wimbledon court
వందేళ్ల సెంటర్‌ కోర్టు వద్ద ఆటగాళ్లు

Wimbledon Court: ఆ కోర్టు.. బిల్‌ టిల్డెన్‌, హెలెన్‌ విల్స్‌, డాన్‌ బడ్జ్‌, సుజానె తొలితరం టెన్నిస్‌ క్రీడాకారుల ఆటకు వేదికగా నిలిచింది. రాడ్‌ లేవర్‌, బిల్లీ జీన్‌ కింగ్‌, గిబ్సన్‌ లాంటి తర్వాతి తరం ప్లేయర్ల అద్భుత విన్యాసాలకు సాక్షి అయింది. సెరెనా విలియమ్స్‌, రోజర్‌ ఫెదరర్‌, నాదల్‌, జకోవిచ్‌, మార్టినా నవ్రతిలోవా, పీట్‌ సంప్రాస్‌ లాంటి ఆధునిక దిగ్గజాల అద్భుత విజయాల అడ్డాగానూ మారింది. వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంటర్ కోర్టు గురించే ఈ ఉపోద్ఘాతం. 1922లో ప్రారంభమైన ఆ కోర్టు ఇప్పుడు వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆనవాయితీ ప్రకారం వింబుల్డన్‌ మధ్యలో వచ్చే ఆదివారం మ్యాచ్‌లు జరగవు. కానీ ఆ కోర్టు శత వసంత ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఆ రోజు కూడా ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించారు.

వందేళ్ల సెంటర్‌ కోర్టు వద్ద ఆటగాళ్లు
వందేళ్ల సెంటర్‌ కోర్టు వద్ద ఆటగాళ్లు

చెయిర్‌ అంపైర్‌ స్టాండ్‌ పక్కన 'సెంటర్‌ కోర్టు', '100' అనే పదాలు దర్శనమిచ్చాయి. విశిష్టమైన టోర్నీ టవల్‌ను అందుబాటులో ఉంచారు. ఆరంభంలో 9,989గా ఉన్న సీట్ల సంఖ్య 14,974కు పెరిగాయి. 2009లో ముడుచుకునే పైకప్పు ఏర్పాటు చేశారు. వింబుల్డన్‌ సింగిల్స్‌ విజేతలందరినీ వందేళ్ల వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈ కోర్టుతో ఉన్న అనుభవాన్ని తాజా, మాజీ ఆటగాళ్లు పంచుకున్నారు. "సెంటర్‌ కోర్టు టెన్నిస్‌కు మక్కా లాంటిది. ఎన్ని గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలున్నా ఇక్కడ అడుగుపెడితే ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది" అని ఏడుసార్లు వింబుల్డన్‌ ఛాంపియన్‌ సంప్రాస్‌ పేర్కొన్నాడు. అత్యధికంగా ఎనిమిది సార్లు వింబుల్డన్‌ విజేతగా నిలిచిన ఫెదరర్‌ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మోకాలి శస్త్రచికిత్స కారణంగా అతను తొలిసారి ఈ టోర్నీకి దూరమయ్యాడు. 1999లో ఇక్కడ మొదటిసారి పోటీపడ్డ ఫెదరర్‌ వరుసగా 22 సీజన్లు ఈ టోర్నీలో పోటీపడ్డాడు.

ఇవీ చదవండి: నేను పొరపాటున టీమ్​ఇండియాకు కోచ్​ అయ్యాను: రవిశాస్త్రి

హిట్​మ్యాన్​​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. రోహిత్​కు క్వారంటైన్​ పూర్తి.. టీ20 సిరీస్​కు రెడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.