ETV Bharat / sports

ఒలింపిక్​ టార్చ్​తో సెల్ఫీ కోసం ఎగబడిన వేలాది జనం

author img

By

Published : Mar 22, 2020, 6:46 PM IST

గ్రీసులోని పురాతన ఒలింపియాడ్​లో వెలిగిన ఒలింపిక్ జ్యోతి.. ఇటీవలే జపాన్​ చేరింది. ఆ టార్చ్​ను సందర్శనార్ధం కోసం ఉంచగా, వేలాది మంది జనం దానిని చూసేందుకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనూ జపాన్​ వాసులంతా టార్చ్​తో సెల్ఫీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు.

Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan
ఒలింపిక్​ టార్చ్​తో సెల్ఫీ.. ఎగబడిన వేలాది జనం

దక్షిణ జపాన్​ ప్రాంతానికి చేరిన ఒలింపిక్స్​ జ్యోతిని వీక్షించేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. చిన్నా పెద్దా లేకుండా కరోనా నిబంధనలను పక్కన పెట్టి రోడ్లపైకి వచ్చారు. ఆ టార్చ్​ ముందు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan
జపాన్​లో టోక్యో ఒలింపిక్​ టార్చ్​
Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan
ఒలింపిక్​ క్రీడా టార్చ్​ను ఫొటోలు తీస్తున్న జనం

వేలమంది గంటల తరబడి

జపాన్​ మియాగి ప్రాంతంలోని సెండాయ్​ స్టేషన్​లో ఈ జ్యోతిని సందర్శనార్ధం ఉంచారు. ఈ ఆహ్వాన కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరయ్యారు. టార్చ్​ను ప్రత్యక్షంగా చూసేందుకు గంటల పాటు అరకిలోమీటర్ దూరం క్యూలో జనం నిల్చున్నారు.

Thousands of people flocked to take Selfies with the Olympic flame in northeastern Japan
క్యూలో నిల్చున్న ప్రజలు

26 నుంచి యాత్ర

ఒలింపిక్‌ టార్చ్‌ రిలే మార్చి 26న ఫుకుషిమాలో ఆరంభమవుతుంది. అయితే కరోనా భయపెడుతున్న నేపథ్యంలో నాలుగు నెలల జ్యోతి యాత్రలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. యాత్ర జరిగే మార్గాల్లో ఎక్కువగా వీధుల్లోకి రావొద్దని నిర్వాహకులు ఇప్పటికే కోరారు.

జులై 24న ప్రారంభమవ్వాల్సిన టోక్యో ఒలింపిక్స్​పై ఇప్పటికీ సందిగ్ధం నెలకొంది. చాలా మంది క్రీడాకారులు ఈ మెగాటోర్నీని వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై టోక్యో ప్రభుత్వం, అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమచారం. సెప్టెంబర్​ లేదా అక్టోబర్​లో నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.