ETV Bharat / sports

స్విస్​ ఓపెన్​ టైటిల్​ విజేతగా పీవీ సింధు.. ప్రణయ్​కు నిరాశ

author img

By

Published : Mar 27, 2022, 4:39 PM IST

Updated : Mar 27, 2022, 8:58 PM IST

Swisopen 2022 PV Sindhu
Swisopen 2022 PV Sindhu

16:33 March 27

స్విస్​ ఓపెన్​ టైటిల్​ విజేతగా పీవీ సింధు

PV Sinhu Swis open: భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు స్విస్​ ఓపెన్​లో అదరగొట్టింది. నేడు(ఆదివారం) జరిగిన స్విస్​ ఓపెన్​ ఫైనల్​లో థాయిలాండ్​కు చెందిన బుసానన్​పై 16-21, 8-21 తేడాతో గెలుపొంది.. టైటిల్​ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​ 49 నిమిషాల్లోనే ముగిసింది.

ఈ ఏడాదిలో సింధుకు ఇది రెండో సూపర్ 300 టైటిల్. జనవరిలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్​ను గెలుచుకుంది. ఇక ఈ స్విస్​ ఓపెన్​కు ముందు గత వారం జరిగిన ఆల్​ ఇంగ్లండ్​ ఓపెన్​లో సింధు సెమీస్​ వరకు వెళ్లి నిష్క్రమించింది. సెమీఫైనల్లో థాయ్​లాండ్​ ప్లేయర్​ పోర్న్‌పావీ చోచువాంగ్ చేతిలో 17-21, 9-21 తేడాతో పరాజయం పాలైంది. ఇక మార్చి మొదటి వారంలో జర్మన్​ ఓపెన్​లో మహిళల సింగిల్స్​ రెండో రౌండ్​లోనే సింధు వెనుదిరిగింది. చైనాకు చెందిన ఝాంగ్​యి మాన్ చేతిలో 14-21 21-15 14-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. కాగా, ఈ టోర్నీ పురుషుల సింగిల్స్​లో​ ఫైనల్​కు చేరిన భారత బ్యాడ్మింటన్​ ప్లేయర్​ హెచ్​ఎస్​ ప్రణయ్​కు నిరాశ ఎదురైంది. ఇండోనేసియాకు చెందిన క్రిస్టో చేతిలో 12-21, 18-21 తేడాతో ఓటమి పాలయ్యాడు. ఈ మ్యాచ్​ 48 నిమిషాల పాటు సాగింది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

స్విస్​ ఓపెన్ విజయం సాధించడంపై పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసించారు. "ఆమె సాధించిన విజయాలు భారతదేశ యువతకు స్ఫూర్తినిస్తాయి. భవిష్యత్​లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నా" అని అన్నారు.

ఇదీ చూడండి: IPL 2022: టాస్​ నెగ్గిన దిల్లీ.. ముంబయి బ్యాటింగ్​

Last Updated : Mar 27, 2022, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.