ETV Bharat / sports

అదరగొట్టిన పీవీ సింధు.. సైనా, ప్రణయ్​ టోర్నీ నుంచి ఔట్​

author img

By

Published : Jul 15, 2022, 3:02 PM IST

Singapore open 2022: సింగపూర్ ఓపెన్​ క్వార్టర్స్​ ఫైనల్​లో పీవీ సింధు సత్తా చాటగా.. సైనా నెహ్వాల్​, హెచ్ఎస్​ ప్రణయ్​కు భంగపాటు ఎదురైంది. దీంతో సింధు సెమీఫైనల్​కు అర్హత సాధించగా.. మిగతా ఇద్దరు టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Singapore open 2022 PV Sindhu
అదరగొట్టిన పీవీ సింధు

Singapore open 2022: సింగపూర్​ ఓపెన్​ 2022 టోర్నీలో భారత స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు అదరగొట్టింది. క్వార్టర్​ ఫైనల్​లో చైనా షట్లర్​ హన్​ యూపై విజయం సాధించింది. ప్రత్యర్థిని 17-21, 21-11, 21-19 తేడాతో ఓడించి సెమీఫైనల్​లో అడుగుపెట్టింది.

మరోవైపు భారత షట్లర్​ సైనా నెహ్వాల్​కు చుక్కెదురైంది. జాపన్​ ప్లేయర్​ ఒహరి ఒహోరి(aya ohori) చేతిలో ఓటమి పాలైంది. క్వార్టర్ పైనల్స్​లో 13-21, 21-15, 20-22 తేడాతో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక భారత షట్లర్​ హెచ్​ఎస్​ ప్రణయ్​ కూడా క్వార్టర్స్​లో జపాన్​కు చెందిన కొడాయి నరోకా చేతిలో ఓడి ఇంటిముఖం పట్టాడు.

ఇదీ చూడండి: కోహ్లీపై పాక్​ సారథి కామెంట్​.. వైరల్​గా మారిన ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.