ETV Bharat / sports

Ronaldo Instagram Followers : ఇన్​స్టాగ్రామ్​లో రొనాల్డో నయా రికార్డు​.. ఆ ఘనత సాధించిన ఏకైక వ్యక్తిగా..

author img

By

Published : Aug 11, 2023, 11:16 AM IST

Updated : Aug 11, 2023, 3:41 PM IST

Ronaldo Instagram Followers : దిగ్గజ పోర్చుగల్ ఫుట్‌బాలర్​ క్రిస్టియానో రొనాల్డో తాజాగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే ఈ స్టార్​ ఇప్పుడు ఇన్​స్టాలో తన పేరిట ఓ నయా రికార్డును లిఖించుకున్నాడు. అదేంటంటే..

Ronaldo Instagram Followers
రొనాల్డో ఇన్​స్టాగ్రామ్​ ఫాలోవర్స్

Ronaldo Instagram Followers : పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సోషల్​ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్​గా ఉంటూ తన ఫ్యాన్స్​తో టచ్​లో ఉండే రొనాల్డో.. ఇప్పుడు ఇదే వేదికపై 60 కోట్ల మంది ఫొలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక ఫాలోవర్లను సంపాదించికున్న వ్యక్తిగా రికార్డుకెక్కాడు.

Remuneration Ronaldo Instagram : గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకు అతడి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 15 కోట్లు పెరగడం విశేషం. 14 నెలల్లోనే 34 శాతం మంది ఫాలోవర్లు పెరిగారని 'సోషల్ బ్లేడ్' సర్వే వెల్లడించింది. అయితే రోనాల్డో ఫాలోవర్ల సంఖ్య నవంబర్ 2022లో 50 కోట్లకు చేరింది.

Cristiano Ronaldo Net Worth : ఈ రేంజ్​లో ఫాలోవర్లు ఉన్నారు కాబట్టే ఇన్‌స్టాలో రొనాల్డో చేసే ఒక్కో పోస్టుకు అదే స్థాయిలో డబ్బు అందుకుంటాడు. రొనాల్డో తాను ఇన్‌స్టాలో చేసే ఒక్కో పోస్టుకు సుమారు 28 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.19 కోట్లు డిమాండ్ చేస్తుండటం విశేషం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రస్తుతం రొనాల్డో ఆస్తుల విలువ 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.4100 కోట్లు). ప్రపంచంలోని అత్యంత సంపన్న అథ్లెట్లలో రొనాల్డో కూడా ఒకడు. క్లబ్, మ్యాచ్ ఫీజులే కాకుండా ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా రొనాల్డో భారీగా సంపాదిస్తున్నాడు. హెర్బాలైఫ్, అర్మాని, ట్యాగ్ హ్యూయర్​ వంటి కంపెనీలకు రోనాల్డో బ్రాండ్​ అంబాసిడర్​గా ఉన్నాడు.

ఫోర్బ్స్​ రిలీజ్​ చేసిన అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్ల జాబితాలో 2017 సంవత్సరానికి గానూ రోనాల్డ్​ మొదటి స్థానంలో నిలిచాడు. అప్పటినుంచి అదే స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతోపాటు ఏడాదికి అత్యధికంగా సంపాదిస్తున్న అథ్లెట్​గా గిన్నీస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించుకున్నాడు. రోనాల్డో తర్వాత అర్జెంటినా సాకర్ వరల్డ్​ కప్ వీరుడు లియోనెల్ మెస్సీ ..​ 482 మిలియన్లతో అత్యధిక ఫాలోవర్లతో జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. అమెరికన్ సింగర్ సెలీనా గోమెజ్​ 427 మిలియన్ల ఫాలోవర్లతో ఆ తర్వాతి స్థానంలో ఉంది.

Top 10 Most Followed Instagram Accounts : కైలీ జెన్నర్, డ్వేన్ జాన్సన్ (ది రాక్), అరియానా గ్రాండే, బెయోన్స్, కిమ్ కర్దాషియాన్, బియాన్స్, ఖ్లో కర్దాషియన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక మంది అనుసరించే వ్యక్తుల జాబితాలో టాప్​ 10 స్థానాల్లో ఉన్నారు. అయితే, వీరందరికన్నా ఎక్కువ మంది అనుసరిస్తున్న ఖాతా (65 కోట్లు) మాత్రం ఇన్​స్టాగ్రామ్​ యాప్​దే.

కోహ్లీ ఇన్​స్టా రికార్డు.. ఇండియన్ సెలబ్రిటీల్లో అగ్రస్థానం!

హార్దిక్​ పాండ్య అరుదైన ఘనత.. దిగ్గజాలను వెనక్కి నెట్టిన ఆల్​రౌండర్​

Last Updated :Aug 11, 2023, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.